రూ.500 కోట్లు ఏవి, నేను తాలిబన్ టెర్రరిస్ట్‌నా?: బాబుపై ముద్రగడ ఫైర్
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన, టిడిపి ప్రభుత్వం పైన కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం లేదన్నారు.
రూ.500 కోట్లు మంజూరు చేస్తామని ఇప్పటి వరకు చేయలేదన్నారు. ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలని గాలికి వదిలేసిందన్నారు. కాపులను పోలీసులు వేధిస్తున్నారని, కేసులు పెడుతున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. నేను ఏమైనా తాలిబన్ టెర్రరిస్టునా అని ముద్రగడ ఘాటుగా ప్రశ్నించారు.

ముద్రగడ అనుచరుల ఆందోళన
ముద్రగడ అనుచరులు సోమవారం నాడు ఆందోళన చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ డీటీసీ కార్యాలయం ఎదుట ముద్రగడ అనుచరులు ఆందోళనకు దిగారు. ముద్రగడపై ఎంవీఐ రవికుమార్ అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపిస్తున్నారు. రవి కుమార్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక హోదా ప్రకటన రాకపోవడం బాధాకరం: రామకృష్ణ
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాడు కేంద్రం చెప్పిందని, బిజెపి నేతలు కూడా హామీ ఇచ్చారని, ఇప్పుడు బడ్జెట్‌లో ప్రత్యేక హోదా గురించి ఏం లేకపోవడం బాధాకరమని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు అడిగితే రూ.100 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.












Click it and Unblock the Notifications