Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేక్ కట్ చేసిన ముద్రగడ: జై కొట్టిన నాయకులు

కాకినాడ: తునిలో రైలు దగ్ధం కేసు కొట్టేయడాన్ని కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్వాగతించారు. విజయవాడలోని రైల్వే న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాపు నాయకులు, తన అనుచరులు, అభిమానులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.

తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు రైల్వే అధికారులు సక్రమంగా విచారణ నిర్వహించలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన సమస్యను అయిదు సంవత్సరాల పాటు ఎందుకు కొనసాగించారంటూ ప్రశ్నించింది.

Mudragada Padmanabham welcome the dismissed

2016 జనవరిలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లను కల్పించాలంటూ తుని వద్ద ముద్రగడ పద్మనాభం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఆందోళనకారులపై కేసులు నమోదు చేసింది. ఈ ఘటనలో మొత్తం 69 కేసులను పెట్టింది.

ఈ కేసుల జాబితాలో ఏ1 ముద్రగడ పద్మనాభం పేరును నమోదు చేశారు రైల్వే పోలీసులు. ఏ2గా ఆకుల రామకృష్ణ, ఏ3గా మంత్రి దాడిశెట్టి రాజా పేర్లను జాబితాలో చేర్చారు. వారితో సహా మొత్తం 41 మందిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. కడప జిల్లా నుంచి వచ్చిన గూండాలే రత్నాచల్ రైలుకు నిప్పు పెట్టారంటూ అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన సంచనలం రేపిన విషయం తెలిసిందే.

2019 నాటి సార్వత్రిక ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. ఆయా కేసులన్నింటినీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా ఈ రైలు దగ్ధం కేసును కోర్టు కొట్టేయడంతో కాపు నేతలు హర్షం వ్యక్తం చేస్తోన్నారు.

ఈ ఉదయం కాకినాడ జిల్లాలోని కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం తన అనుచరులు, అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు. వారికి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా అభిమానులు ముద్రగడకు జై కొట్టారు. ముద్రగడ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ముద్రగడ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినదించారు. ఆయన సారథ్యంలో కాపు రిజర్వేషన్లను సాధించి తీరుతామంటూ ధీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+