ముద్రగడ ఎంట్రీతో గోదావరి లెక్క మారేనా - రెండు ఆఫర్లు...!!

కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఏపీలో మారుతున్న రాజకయ సమీకరణాల్లో భాగంగా గోదావరి జిల్లా రాజకీయం కీలకంగా మారుతోంది. ఈ ప్రాంతంలో జనసేన ప్రభావం బలంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో, వైసీపీ వ్యూహాత్మకంగా ముద్రగడను తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది.అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 2న ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. రెండు ఆఫర్లు ముద్రగడ ముందున్నాయి.

వైసీపీలోకి పద్మనాభం
ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయంగా యాక్టివ్ కానున్నారు. 2014లో టీడీపీ కాపులను బీసీల్లో చేర్చే అంశం పైన హామీ ఇచ్చారు. ముద్రగడ ఇదే డిమాండ్ తో చాలా కాలం ఉద్యమం చేసారు. చంద్రబాబు హాయంలో ముద్రగడ ఈ ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లారు. దీంతో, చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చే అంశం పై మంజునాధ కమిషన్ నియమించారు.

Kapu leader Mudragada to join in YSRCP likely to contest from Kakinadala Loksabaha in next Elections

కానీ, ఆ కమిటీ నివేదిక..తరువాతి నిర్ణయాలు విమర్శలకు కారణమయ్యాయి. తరువాత కేంద్ర ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల నిర్ణయంలో భాగంగా నాడు చంద్రబాబు ప్రభుత్వం కాపులకు 5 శాతం కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ, తరువాతి కాలంలో అమలు కాలేదు.

గోదావరిలో కొత్త లెక్కలు
ఇక, ఇప్పుడు కాపు వర్గం జనసేనకు మద్దతుగా నిలుస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో కాపు ఉద్యమ నేత వైసీపీలో చేరటం ద్వారా కాపు వర్గం మద్దతు పొందే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో కాపు వర్గం ఉంది. ఇప్పుడు పవన్ టీడీపీతో పొత్తు ద్వారా కాపు వర్గంలోనూ భిన్నాభిప్రాయలు ఉన్నాయనే వాదన ఉంది.

ఇదే సమయంలో ముద్రగడ వైసీపీలో చేరి..ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే కాపు వర్గం ఏ మేర వైసీపీ వైపు మళ్లుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే జగన్ సామాజిక న్యాయం పేరుతో గోదావరి జిల్లాల్లో కొత్త సమీరణాలను అమలు చేస్తున్నారు. సిట్టింగ్ లను మారుస్తున్నారు.

పోటీ ఖాయమా
ఇక, ఇప్పుడు ముదగ్రడ వైసీపీలో చేరితే రెండు ఆఫర్లు సిద్దంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో నేరుగా ముద్రగడ పోటీ చేస్తే కాకినాడ లోక్ సభ..లేదా ఆయన కుమరుడు పోటీ చేస్తే పెద్దాపురం సీటు ఇవ్వాలనే చర్చ పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో పెద్దాపురం నుంచి పోటీ చేసిన తోట వాణి స్ధానంలో ఈసారి ఆమె భర్త తోట నర్సింహంకు జగ్గంపేట సీటు కేటాయిస్తున్నారని తెలుస్తున్న నేపథ్యంలో.. పెద్దాపురం సీటులో ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లారావు కు అవకాశం దక్కనుంది.

మరోపక్క కాకినాడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీతను రాబోయే ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ముద్రగడ పోటీ చేస్తారా..కుమారుడిని బరిలోకి దింపుతారా అనే నిర్ణయానికి అనుగుణంగా సీటు పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. దీంతో..ముద్రగడ వైసీపీలో చేరటం ద్వారా గోదావరి రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటయనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+