చంద్రబాబుపై ఏం చేద్దాం?: దాసరి నారాయణ రావుతో ముద్రగడ
హైదరాబాద్: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభంతో కాపు నేతలు దాసరి నారాయణ రావు, అంబటి రాంబాబు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు సమావేశమయ్యారు. భవిష్యత్తు కార్యాచరణ పైన వారు చర్చిస్తున్నారు. చిరంజీవి హాజరు కాలేదు.
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు 2014 సార్వత్రిక ఎన్నికలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఓ కమిషన్ వేశారు. దాని గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఏం చేయాలనే దాని పైన కాపు నేతలు చర్చిస్తున్నారు.

కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు వెంటనే అమలు చేయాలని, రిజర్వేషన్లు ఇవ్వాలని ముద్రగడ ఈ ఏడాది ఆరంభంలో నిరాహార దీక్ష చేశారు. కాపు కమిషన్ వేశామని, నిర్ణీత గడువులోగా నివేదిక ఇచ్చిన తర్వాత తాము రిజర్వేషన్లు కల్పిస్తామని ముద్రగడకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. గడువు పూర్తయినా హామీ నెరవేరకపోవడంతో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications