కాపునాడు నేత మిరియాల మృతి: పలువురి సంతాపం
హైదరాబాద్: కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు మిరియాల వెంకట్రావు(75) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఈనెల 3వ తేదీ రాత్రి యూరినరీ ట్రాక్ ఇన్ ఫెక్షన్ (యుటీఐ)తో బాధపడుతున్న వెంకట్రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. నాటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకట్రావును కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి ఆదివారం ఉదయం పరామర్శించారు.
వెంకట్రావు భౌతికకాయాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ తెలగ, కాపు, బలిజ సంఘం(నాయుడు కళాశాల) ప్రాంగణంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్టణంలోని సీతమ్మధారలో వెంకట్రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కాపునాడు నాయకులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1939 డిసెంబర్ 25న జన్మించిన వెంకట్రావుకు భార్య ప్రమీణ, కొడుకు ఎం.వి.శేషగిరిబాబు, కూతురు స్వాతి ఉన్నారు. శేషగిరిబాబు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ(ఐఏఎస్)గా విధులు నిర్వహిస్తున్నారు. కూతురు స్వాతి కెనడాలో ఉంటుంది. తొలుత ముత్యాలు, పగడాల వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించిన వెంకట్రావు తర్వాత సివిల్ కాంట్రాక్టులు చేసేవారు.

కాపులకు రాజకీయంగా అన్యాయంగా జరుగుతోందంటూ 1982లో ఆయన విజయవాడలో కాపునాడును ఏర్పాటు చేశారు. నాటి నుంచి కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాపు, తెలగ, ఒంటరి, తూర్పుకాపు, మున్నూరు కాపులను ఏకతాటికిపై తీసుకొచ్చేందుకు కృషి చేశారు. కాపులకు రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాలని, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పలు సందర్భాల్లో ఉద్యమిస్తూ వచ్చారు.
మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, హస్తకళల అభివృద్ది సంస్థ చైర్మన్‌గా వెంకట్రావు పనిచేశారు. కాగా, వెంకట్రావు మృతికి ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. రాష్ట్రంలో ఓ బలమైన సామాజికవర్గానికి విశేష సేవలందించిన వెంకట్రావు, ఆ సామాజికవర్గంలో రాజకీయ చైతన్యాన్ని తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారని చంద్రబాబు అన్నారు. వెంకట్రావు కుటుంబసభ్యులకు ఆయన తన సానుభూతి తెలిపారు.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, ఏపీ కాపునాడు రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు వీపీ నారాయణస్వామి రాయల్ నివాళులు అర్పించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications