పవన్ కల్యాణ్‌పై మహిళల ఆగ్రహం: ఫ్లెక్సీలకు నిప్పు
గుంటూరు: కాపు రిజర్వేషన్ల సెగ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌కు దండిగానే తాకుతోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని చోట్ల కాపు యువత పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను చించివేసిన తెలిసిందే. తాజాగా, గుంటూరు జిల్లాలో మహిళలు పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .
పవన్ కల్యాణ్ స్పందిస్తున్న సరిగా లేదంటూ మహిళలు కొందరు ఆయన ఫ్లెక్సీలకు నిప్పు పెట్టి వాటిని దగ్ధం చేశారు. తాము అమితంగా అభిమానించే పవన్ కల్యాణ్ స్పందన కాపు సమస్యల విషయంలో సరిగా లేదని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేస్తారనే నమ్మకంతో పవన్ కల్యాణ్ చెప్పారని తెలుగుదేశం పార్టీకి ఓట్లేశామని వారు చెబుతున్నారు.

గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పొడి గ్రామంలోనూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపూర్, భీమవరం ప్రాంతాల్లోనూ కాపు యువకులు పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలను ఇటీవల ధ్వంసం చేశారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగిన సమయంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సమర్థిస్తున్నట్లు వారు భావిస్తున్నారు.
ఫ్లెక్సీలను చించేయడమే కాకుండా పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా యువకులు నినాదాలు కూడా చేశారు. తాను ఓ కులానికి చెందినవాడిని కానని, ఓ కులం కోసం పోరాటం చేయడానికి తాను ఇక్కడికి రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు.












Click it and Unblock the Notifications