బాబును కలసేందుకొచ్చి లిఫ్ట్‌లో ఇరుకున్నారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధికారిక వసతి గృహం లేక్‌వ్యూలో శుక్రవారం లిఫ్ట్ మొరాయించింది. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన కాపునాడు ప్రతినిధులు 40 నిమిషాల పాటు టెన్షన్‌కు గురయ్యారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది బలంగా గేట్లు వంచి లిఫ్ట్‌లో ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు.

శుక్రవారం కాపుల సంక్షేమం కోసం రూ. 5000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందించటానికి రాష్ట్ర కాపునాడు ప్రతినిధులు పిల్లా వెంకటేశ్వరరావు, వి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో 8మంది లిఫ్ట్‌లో ఎక్కారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఆగిపోయింది.
ఆగిపోయిన కొద్ది సేపటికే లోపల ఉన్న లైట్లు, ఫ్యాను ఆగిపోయాయి. దీంతో లిఫ్ట్‌లో ఉన్న వాళ్లు భయంతో పెద్దగా కేకలు వేస్తూ, మీడియాకు ఫోన్‌లు చేశారు. లేక్‌వ్యూలో పాత కాలపు లిఫ్ట్ వల్ల ఆగిపోయిందని.. సమయానికి సెక్యూరిటీ సిబ్బంది రాకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండేదని వారన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications