ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి: కవిత
టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన 'ఇడుపు కాయితం' అంశంపై ఘాటుగా స్పందించారు. ఈ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత దాని అర్థం ఏమిటని ఆంధ్రాకు చెందిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టటంతో రచ్చ జరుగుతోంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వాడే ఈ పదాన్ని కొందరు ట్రోల్ చేయడంతో ఆంధ్ర-తెలంగాణ నెటిజన్ల మధ్య వివాదం కాస్తా చిలికిచిలికి గాలివానైంది.
పవన్ కళ్యాణ్ కు ఇడుపు కాయితం బాగా తెలుసన్న కవిత
కవిత తన వ్యాఖ్యల్లో ఇడుపు కాయితం అర్థం తెలియాలంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అడగాలని సెటైర్ వేశారు. ఆయనకు ఈ పదం బాగా తెలుసని, సరైన వివరణ ఇస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భాష మీద అవహేళన చేయడం సరికాదని, ఇలాంటి వెకిలి ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు. ఒకరి భాషను, సంస్కృతిని ఒకరు గౌరవించుకోవాలని, అందరం కలిసి ఉండాలని సందేశం ఇచ్చారు.

భాషను కించపరిస్తే సహించేది లేదు
తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రంలో భాషను కించపరచడం సహించబోమని కవిత మండిపడ్డారు. బీజేపీకి తెలంగాణ కంటే జాతీయ అంశాలే ముఖ్యమని కూడా ఆమె అన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన కవిత ఆయన వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకుని మళ్ళీ వివాహం చేసుకోవటంతో ఇడుపుకాయితం అంటే పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసనీ స్పష్టం చేశారు.
ఇడుపుకాయితం సినిమా రచ్చ
'ఇడుపు కాయితం' అంటే విడాకుల పత్రం లాంటి ఒప్పంద పత్రం. గ్రామీణ తెలంగాణలో దంపతులు విడిపోయేటప్పుడు పెద్దల సమక్షంలో చేసుకునే ఒప్పందాన్ని ఈ పేరుతో పిలుస్తారు. ప్రియదర్శి, నాగదుర్గ నటించిన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత టైటిల్ సోషల్ మీడియాలో పోస్టు లతో రచ్చ మొదలైంది.
పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన కవిత
కవిత వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ పెళ్లి విషయాలను కూడా ప్రస్తావించాయని, ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేశాయని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య భాషా గౌరవం, సాంస్కృతిక వైవిధ్యాన్ని మరోసారి చర్చనీయాంశం చేసింది. ఇది రాజకీయ వర్గాల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణం అవుతున్నాయి.













Click it and Unblock the Notifications