కాపులవల్లే గెలుపు: మండలి, పవన్‌కు మంచి పేరు: కోట

టీడీపీ వెంట కాపులు నడవడంతో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. చంద్రబాబు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇఛ్చారన్నారు. కాపులను బీసీలుగా గుర్తించే ప్రక్రియలో జాప్యం జరగకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీని కోసం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు కాలనిర్దేశనం చేయాల్సిన అవసరముందన్నారు.
బలిజ, కాపు, తెలగలను బీసీలుగా గుర్తించే ప్రక్రియలో చంద్రబాబుకు తాము అందరం అండగా నిలుస్తామన్నారు. తాను ఉపసభాపతిగా ఉన్నప్పుటే కాపులను బీసీలుగా గుర్తిస్తూ చట్టం వస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. కాపులు శ్రమజీవులని, ఆత్మాభిమానం కలిగిన వారన్నారు.
ఇప్పుడు రాజకీయంగా కాపులకు మంచి రోజులు వచ్చాయని, చాలాకాలంగా కాపులు అణచివేతకు గురయ్యారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు అన్నారు. కొత్తగా జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ వెంటనే ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీకి అండగా నిలిచి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. టీడీపీ పాలనలోనే కాపులకు న్యాయం జరుగుతుందని యలమంచిలి ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు.












Click it and Unblock the Notifications