కర్ణాటకలో కాంగ్రెస్ కు కలిసొచ్చిన ఏపీ సీఎం జగన్ నినాదం..!!

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించటానికి కాంగ్రెస్ అనేక వ్యూహాలు అమలు చేసింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర మొదలు పార్టీలో ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. బీజేపీ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా పేదల్లో ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ గుర్తించింది. వారిని ఆకట్టుకోవటానికి పదునైన నినాదాలను ప్రయోగించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పదే పదే ప్రస్తావించే నినాదమే ఇప్పుడు కన్నడ నాట కాంగ్రెస్ కు విజయాన్ని అందించింది. రాహుల్ సైతం ఇదే ప్రస్తావించారు.

పని చేసిన కాంగ్రెస్ నినాదం: కర్ణాటకలో అంచనాలకు మించి కాంగ్రెస్ విజయం సాధించింది. జేడీఎస్ మద్దతు అవసరం అవుతుందనే అంచనాలు తలకిందులయ్యాయి. బీజేపీ 60 సీట్లకు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మేజిక్ ఫిగర్ 113 కాగా కాంగ్రెస్ దాదాపు 140 సీట్ల వరకు గెలుచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. కింగ్ లేదా కింగ్ మేకర్ గా అవ్వాలని భావించిన కుమార స్వామి కలలు ఫలించలేదు. అటు బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందని గుర్తించినా...చికిత్స చేయకపోవటం కాంగ్రెస్ కు కలిసొచ్చింది. గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను ఆకట్టుకోవటం కోసం కాంగ్రెస్ బీజేపీని పెట్టుబడి దారుల పార్టీగా ప్రచారం చేసింది. తమది పేదల పార్టీగా చెప్పుకొచ్చింది.

Karnataka assembly election results:

ఏపీలో జగన్ స్లోగన్ ఇదే: ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఇదే స్లోగన్ నమ్ముకున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పేదల ఇంట మంచి జరుగుతోందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలు పెత్తందార్లకు మద్దతుగా నిలిచే టీడీపీ-జనసేన, పేదలకు మద్దతుగా నిలుస్తున్న తన పార్టీ మధ్య జరిగే క్లాస్ వార్ గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు కర్ణాటకలో విజయం పైన స్పందించిన రాహుల్ గాంధీ ఇదే రకమైన విశ్లేషణ చేసారు. కర్ణాటక ఎన్నికలలో పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలు గెలిచారని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల తరఫున పనిచేసిందని వివరించారు. బీజేపీ పెట్టుబడి దారుల పార్టీగా అభివర్ణించారు. దీంతో, కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిన ఈ నినాదం ఏపీలో చర్చకు కారణమవుతోంది.

ఏపీలోనూ అధికారం అందిస్తుందా: జగన్ 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఇప్పుడు ఈ నినాదం తెలంగాణలోని బీజేపీ నేతలు అందుకున్నారు. తెలంగాణలో ఒక్క సారి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల లబ్ది దారులే తన ఓటు బ్యాంకుగా భావిస్తున్న ముఖ్యమంత్రి జగన్ వారికి ప్రతిపక్ష పార్టీలను దూరం చేసే నినాదాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పొరపాటున ప్రతిపక్ష టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు కట్ అవుతాయని చెప్పటంతో పాటుగా రాష్ట్రంలో పేదవారు బతకలేని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కు అధికారం తెచ్చి పెట్టిన పేదల పార్టీ నినాదం.. ఇక ఏపీలో ఎటువంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+