వైసీపీ ప్రభత్వం మారినా పద్దతి మాత్రం మారలేదు, కర్ణాటక లిక్కర్ భలే ఉందిరా బాబు
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం షాపులు ప్రభుత్వ పరం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లిక్కర్ షాపులు దాదాపుగా ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దేశంలో ఎక్కడా లేని చిత్రవిచిత్రమైన బ్రాండ్ల మద్యం విక్రయించారు.
బీర్లు, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్ ఇలా అన్ని రకాల మద్యం దేశంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని అప్పటి వైసీపీ ప్రభుత్వంమీద ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆంధ్రప్రదేశ్ లోని మద్యం బ్రాండ్లు మాత్రం మారలేదు, గతంలో ఉన్న దాదాపు అన్ని పాత బ్రాండ్ల మద్యం విక్రయించలేదు. ఇదే సమయంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కు మద్యం తరలించిన కొందరు మద్యం వ్యాపారం చేసి బాగా డబ్బులు సంపాధించారు.

చాలా జిల్లాల్లో వైసీపీ నాయకులే ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సీఎంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారం చేతికి వచ్చిన తరువాత మాట మార్చి కొత్తకొత్త పనికిమాలిన బ్రాండ్ల మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆయన సొంత చెల్లెలు వైఎస్. షర్మిల కూడా పదేపదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారినా అక్రమ మద్యం వ్యాపారం మాత్రం తగ్గలేదు. కర్ణాటక నుంచి ప్రతినిత్యం భారీ మొత్తంలో మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి.

ఇక ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్టాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా వేశారు. ఆదోనిలో విచ్చలవిడిగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆదోని పట్టణ శివార్లలోని బైపాస్ రోడ్డు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.
అక్రమంగా మద్యం తరలిస్తున్న శివ, నాగరాజు అనే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి ఆదోని పట్టణంలోకి అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్నారని గుర్తించి 840 ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఆదోనికి ఎక్కువగా కర్ణాటక మద్యం సరఫరా అవుతోందని, నిందితులపై నిఘా వేశామని, దొంగ దారుల్లో కర్ణాటక మద్యం తరలిస్తున్నారని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications