వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ మాటంటే: ఎమ్మెల్సీగా కర్నె ప్రమాణం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట తప్పరని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలో ఆయనను మించిన వారు లేరని శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌ అన్నారు. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం తన పేరును సిఫారసు చేయటమే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. గురువారం తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌.. కర్నె ప్రభాకర్‌తో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పద్మారావు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కర్నె ప్రభాకర్‌ నివాళి అర్పించి పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా మండలి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ప్రభాకర్‌ను మండలి చైర్మన్‌, మంత్రులు అభినందించారు.

కర్నె ప్రభాకర్

కర్నె ప్రభాకర్

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట తప్పరని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంలో ఆయనను మించిన వారు లేరని శాసన మండలి సభ్యుడు కర్నె ప్రభాకర్‌ అన్నారు.

కర్నె ప్రభాకర్

కర్నె ప్రభాకర్

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం తన పేరును సిఫారసు చేయటమే అందుకు నిదర్శనమని ఆయన చెప్పారు.

కర్నె ప్రభాకర్

కర్నె ప్రభాకర్

గురువారం తెలంగాణ శాసన మండలి చైర్మన్‌ కె.స్వామిగౌడ్‌.. కర్నె ప్రభాకర్‌తో ఎమ్మెల్సీగా ప్రమాణం చేయించారు.

కర్నె ప్రభాకర్

కర్నె ప్రభాకర్

ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, డిప్యూటీ సిఎం మహమూద్‌ అలీ, మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పద్మారావు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

కర్నె ప్రభాకర్

కర్నె ప్రభాకర్

తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కర్నె ప్రభాకర్‌ నివాళి అర్పించి పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా మండలి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ప్రభాకర్‌ను మండలి చైర్మన్‌, మంత్రులు అభినందించారు.

అనంతరం టిఆర్‌ఎస్‌ నేతలు ఆయనకు తెలంగాణ భవన్‌లో ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్‌, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు, ఫలితాల తర్వాత.. ఎమ్మెల్సీని చేస్తానంటూ తనకు ఇచ్చిన మాటను కెసిఆర్‌ నిలబెట్టుకున్నారని, అదే విధంగా టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి హామీని ఆయన అమలు చేసి తీరుతారని చెప్పారు.

తాను ఎమ్మెల్సీగా నియమితులు కావటానికి కారణమైన సిఎం కేసీఆర్‌తోపాటు కేబినెట్‌కు, సహకరించిన గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిఎం కేసీఆర్‌ ఏ ఆలోచనతో తనను ఎమ్మెల్సీగా నియమించారో.. దానికి అనుగుణంగా తన పని విధానం ఉంటుందని తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన తాను.. అదే ప్రజల కోసం శక్తిమేర పనిచేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో ముందు నిలుస్తానని అన్నారు.

English summary
Karne Prabhakar, a TRS leader, who was not offered a TRS party ticket to contest in the recent general elections, has sworn-in as an MLC in the Telangana state Legislative Council, on Thursday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X