పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ జగన్‌కు ఝలక్
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. చింతపూడి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ కర్రా రాజారావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోనున్నారు.
2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కర్రా రాజారావు చింతలపూడి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్ వైఖరితో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న రాజారావు పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇదిలావుంటే, ఎమ్మార్ కేసులో ప్రధాన నిందితుడైన కోనేరు రాజేంద్ర ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్ధం పుచ్చుకోబోతున్నారని తెలుస్తుంది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరుపున రానున్న ఎన్నికల్లో విజయవాడ నుండి కోనేరు ఎంపీ స్థానానికి పోటీ చేయనున్నారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ విషయంపై అటు కోనేరు గానీ, ఇటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గానీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కోననేరు ప్రసాద్ అనేక అరోపణలు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications