కశ్మీర్ అందాలు చూసొద్దామా..? తక్కువ ధరకే IRCTC కశ్మీర్ అద్దిరిపోయే ప్యాకేజీ!
తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హాలీడేస్ లో చాలా మంది దూర ప్రాంతాలకు టూర్ కు వెళ్తుంటారు. అయితే వేసవిలో ఎక్కువ మంది కశ్మీర్ అందాలను చూసేందుకు ఇష్టపడుతుంటారు. వేసవి తాపాన్ని తట్టుకుని కూల్‌గా చిల్ అయ్యేందుకు దూరపు ప్రదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మర్ లో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేందుకు కశ్మీర్ కోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ మార్చి 13, 2026 న విశాఖ నుంచి ప్రారంభం కానుంది. మార్చి 13వ తేదీ ఉదయం 9 గంటలకు టూర్ స్టార్ట్ అవుతుంది. అలాగే మార్చి 18వ తేదీ రాత్రి 8:35 గంటలకు టూర్ ముగుస్తుంది.
కశ్మీర్ టూర్ లో భాగంగా టూరిస్టులు మొదటి రోజు విశాఖపట్నం విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. శ్రీనగర్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి హోటల్ లో చెక్-ఇన్ అయి.. భోజనం తర్వాత, షికారా రైడ్ ఉంటుంది. హోటల్ లో డిన్నర్, రాత్రి బస ఉంటుంది. రెండో రోజు హోటల్ లో అల్పాహారం తర్వాత సోన్ మార్గ్ పర్యటనకు బయల్దేరుతారు. అక్కడ తాజివాస్ గ్లేషియర్ వరకు పోనీలు(గుర్రాలు) అద్దెకు తీసుకోవచ్చు. వాటిపై ప్రయాణం చేయవచ్చు. సాయంత్రం శ్రీనగర్ హోటల్ లో బస చేస్తారు.
మూడో రోజు రోడ్డు మార్గంలో గుల్మార్గ్ కు బయలుదేరుతారు. అక్కడ ఖిలాన్ మార్గ్ వరకు ఒక చిన్న ట్రెక్కింగ్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి శ్రీనగర్ కు వెళ్లి రాత్రి బస చేస్తారు. నాలుగో రోజు పహల్గామ్ కు వెళ్తారు. పహల్గామ్ కు దారిలో కుంకుమ పూల తోటలు, అవంతిపుర పురాతన పట్టణం కనువిందు చేస్తుంది. ఇక పహల్గామ్ లోనే డిన్నర్, రాత్రి బస ఉంటుంది. అలాగే ఐదో రోజు శ్రీనగర్ చేరుకుంటారు. శంకరాచార్య ఆలయం, మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, షాలిమార్ గార్డెన్ సందర్శిస్తారు. ఆ తర్వాత దాల్ సరస్సు పై జర్నీ ఉంటుంది. రాత్రి హౌస్ బోట్ లో బస చేస్తారు.

ఇక ట్రిప్ లో చివరిరోజు శ్రీనగర్ విమానాశ్రయానికి వెళ్తారు. విమానంలో విశాఖపట్నం చేరుకోవడంతో ట్రిప్ ముగుస్తుంది. టికెట్ ధరల విషయానికి వస్తే ఒక్కొక్కరికి (సింగిల్ ఆక్యుపెన్సీ) రూ.56,070 గా ఉంది. అలాగే డబుల్ అక్యూపెన్సీ అయితే రూ.45,915 కాగా ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.44,490 గా ధరలు ఉన్నాయి. ఇక పిల్లలకు ప్రత్యేకమైన ధరలు అందుబాటులో ఉన్నాయి. ఇక పూర్తి వివరాల కోసం 9281030748, 9281495847, 9550166168 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.












Click it and Unblock the Notifications