కస్తూర్బా పాఠశాల: 6వ తరగతి విద్యార్థిని మృతి
విజయనగరం: జిల్లాలోని బొండపల్లి మండలం దేవుపల్లి కస్తూర్బా పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పైడమ్మ(13) అనే విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. హెల్త్ వర్కర్ ఆశాజ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. పైడమ్మ కడుపునొప్పిగా ఉందనడంతో ఆమెను డాక్టర్ అనిల్‌కుమార్ వద్దకు తీసుకెళ్లారు. డాక్టర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.
పాఠశాల ప్రత్యేకాధికారి సరస్వతి.. ఈ మేరకు పైడమ్మ సంరక్షకుడు శేఖర్‌కు సమాచారం అందించి స్వగ్రామమైన రామభద్రాపురం మండలం ఆర్.చింతలవలసకు ఆమెను పంపించారు. శనివారం ఆమెకు కడపునొప్పి తీవ్రం కావడంతో అక్కడే మృతి చెందింది. పైడమ్మకు పచ్చకామెర్లు వచ్చాయని, సరైన వైద్యం అందించకపోవడంతో మృతి చెందిందని శేఖర్ ఆరోపిస్తున్నారు.
విద్యార్థిని పైడమ్మ మృతిచెందిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ నీలకంఠం, జడ్పీ సభ్యులు బాలాజీ, ఈవోపీఆర్డీ రవికుమార్‌లు పాఠశాలను పరిశీలించారు. మృతికి గల కారణాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో అపరిశుభ్రత ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తహసీల్దార్ తెలిపారు.

కుటుంబ కలహాలు: మహిళ ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం లాలాపేట గ్రామంలో మాలతి అనే ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గన్నేరుకాయలు తిని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెప్పారు. కుటుంబ కలహాల వలే మాలతి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
కృష్ణా జిల్లా విజయవాడ నగరంలోని ఎర్రకట్ట సమీపంలోని ఫ్రూట్ మార్కెట్ వద్ద వేగంగా వస్తున్న ఓ కారు బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications