వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్‌తో భేటీ: గౌరవం పోగొట్టుకోవద్దంటూ జేపీకి కత్తి, ‘జగన్ పార్టీకి మద్దతిస్తారా?’

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొంత కాలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణే లక్ష్యంగా విమర్శల దాడి కొనసాగిస్తున్న సినీ క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి తనదైన శైలిలో విమర్శల దాడి చేశారు. తాజాగా, పవన్ కళ్యాణ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ భేటీ, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు.

ప్రత్యేక హోదాపై రాజకీయం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మహేష్ అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి తాను ఆవేదన చెందుతున్నట్లు చెప్పారు.

నిలబడతారా?

నిలబడతారా?

‘"ప్రత్యేక హోదా మా హక్కు - ప్యాకేజి మాకొద్దు" అని వైఎస్సార్ కాంగ్రెస్ మార్చ్ 5 నుంచి ఉద్యమం మొదలుపెడుతున్నారు. దీనికి మద్దతుగా వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన, ప్రజాసంఘాలు నిలబడతాయా!?' అని కత్తి మహేష్ ప్రశ్నించారు.

 గౌరవం పోగొట్టుకోవద్దని జేపీకి..

గౌరవం పోగొట్టుకోవద్దని జేపీకి..

‘జేపీ గారూ... ఉన్న గౌరవం ఎందుకండి పోగొట్టుకుంటారు! "ప్రత్యేక హోదాను, విభజన హామీలను రాజకీయం చేయకండి" అని మీరు ఎంత హిపోక్రటికల్‌గా అంటున్నారో చూడండి' అని మహేష్ అన్నారు.

నేనేమైనా అంటే బాధపడ్తారు, వారిని తన్నాలనిపిస్తోంది: బడ్జెట్‌పై జేపీ కీలక వ్యాఖ్యలునేనేమైనా అంటే బాధపడ్తారు, వారిని తన్నాలనిపిస్తోంది: బడ్జెట్‌పై జేపీ కీలక వ్యాఖ్యలు

ఉద్యమం చేయండి

ఉద్యమం చేయండి

‘ఇది ముమ్మాటికీ రాజకీయ అంశమే. వాటితోనే ముడిపడి ఉంటుంది. ఆ రియాలిటితో డీల్ చెయ్యండి. ప్రజా పక్షం వహిస్తూ ఒక రాజకీయ ఉద్యమం చెయ్యండి' అని జేపీకి కత్తి మహేష్ సూచించారు. కాగా, జేపీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌తో పవన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవన్ లాంటి శ్రీకృష్ణుడు: జేపీతో భేటీపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు, జేపీ ఇలా, సీపీఐ నేతా కలిశారు!పవన్ లాంటి శ్రీకృష్ణుడు: జేపీతో భేటీపై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు, జేపీ ఇలా, సీపీఐ నేతా కలిశారు!

మోసం చేస్తున్నారు..

మోసం చేస్తున్నారు..

అంతేగాక, ‘ప్రత్యేక హోదా కోసం వైజాగ్, విజయవాడ బంద్ లో పాల్గొన్న నిబద్ధత నాది. జరిగిన అన్యాయం పట్ల, మోసం పట్ల ఆవేదన కలిగినవాన్ని. అది నా ఫోకస్. పవన్ కళ్యాణ్ జేఏసీ అన్నప్పుడు సపోర్ట్ చేసింది అందుకే. ఇప్పుడు జేఎఫ్ఎఫ్‌సీ అని మోసం చేస్తుంటే వ్యతిరేకిస్తోంది అందుకే' అని కత్తి మహేష్ వ్యాఖ్యానించారు.

English summary
Film critic Kathi Mahesh responded on Lok Satta founder President Jayaprakash Narayana's comments on Andhra Pradesh issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X