గోల్కొండ కోటలో కల్వకుంట్ల కవిత, స్మిత (పిక్చర్స్)

హైదరాబాద్: గోల్కొండ కోటలో శుక్రవారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఎంవో కార్యాలయంలో పనిచేస్తున్న స్మిత సబర్వాల్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేకార్షణగా నిలిచారు.

గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జాతీయ పతాకను ఆవిష్కరించారు. పోలీసులకు పతకాలను ప్రదానం చేశారు. దళితులకు మూడు ఎకరాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. సాయుధ బలగాల కవాతు జరిగింది. కెసిఆర్ గౌరవ వందనం స్వీకరించారు.

గోల్కొండ కోటలో అక్బరుద్దీన్...

గోల్కొండ కోటలో అక్బరుద్దీన్...

గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తన శాసనసభ్యులతో కలిసి మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు.

కవితకు అక్బర్ అభివాదం

కవితకు అక్బర్ అభివాదం

గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవితకు అక్బరుద్దీన్ అభివాదం చేశారు.

స్మితా సబర్వాల్ ఇలా..

స్మితా సబర్వాల్ ఇలా..

ఉత్తమ అధికారిగా పేరెన్నిక గని సిఎంవో కార్యాలయంలో పనిచేస్తున్న ఉన్నతాధికారి స్మిత సబర్వాల్ గోల్కొండ కోటలోని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు.

కెసిఆర్‌తో అక్బరుద్దీన్

కెసిఆర్‌తో అక్బరుద్దీన్

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అక్బరుద్దీన్‌తో కరచాలనం చేశారు.

జాతీయ జెండాతో చిన్నారి...

జాతీయ జెండాతో చిన్నారి...

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాదులోని గోల్కొండ కోటలో జాతీయ పతాకతో ఓ చిన్నారి ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+