రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ: బిజెపి గూటికి కావూరి
న్యూఢిల్లీ: కాంగ్రెసులో కొనసాగకూడదని కేంద్ర మంత్రి కావూరి సాంబశివ రావు నిర్ణయించుకున్నారు. ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఆయన గత కొద్ది రోజులుగా ఆలోచన చేస్తున్నారు. ఆయన రెండు మూడు రోజుల్లో బిజెపిలో చేరనున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీలో బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. ప్రస్తుతం ఆయన ఏలూరు నుంచి లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆయన ముందుకు అనుకున్నారు. అయితే, స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఆయన వ్యతిరేకత ఎదురైనట్లు చెబుతున్నారు. దీంతో ఆయన బిజెపిలో చేరే అవకాశాలను మెరుగుపరుచుకున్నారు.

పార్టీ మారాలనే ఆలోచనను కావూరి చేత ఉపసంహరింపజేయడానికి ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కలిశారు. కేంద్ర మంత్రి జెడి శీలం చొరవతో కావూరి సాంబశివ రావు శుక్రవారం రాహుల్ గాంధీని కలిశారు. కావూరికి నచ్చజెప్పడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అయినా కావూరి తన మనసు మార్చుకోలేదు.
రాష్ట్ర విభజనపై తీవ్రంగా అసంతృప్తికి గురైన కావూరి సాంబశివ రావు కాంగ్రెసులో కొనసాగడానికి ఇష్టపడండ లేదు. సీమాంధ్రలో కాంగ్రెసు పరిస్థితి తీసికట్టుగా ఉండడం కూడా ఆయన పార్టీ మారడానికి కారణంగా చెబుతున్నారు. తెలుగుదేశంతో బిజెపి పొత్తు కుదురుతున్న నేపథ్యంలో కావూరి నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.












Click it and Unblock the Notifications