ఆట మొదలైందా..త్వరలో ఏపికి కేసీఆర్ ..జగన్ తో కీలక భేటీ: హోదా పై మార్పు లేదన్న కేటీఆర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఏపికి రానున్నారు. ఏపిలోనే వైసిపి అధినేత..విపక్ష నేత జగన్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు పై ఆ సమావేశంలో చర్చించటం తో పాటుగా ఏపి రాజకీయాల పైనా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఏపికి ప్రత్యేక హోదా విషయంలో టిఆర్‌యస్ వైఖరి మార్పు లేదని టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రకటించారు.

ఏపికి కేసీఆర్..జగన్ తో భేటీ..
త్వరలోనే ఏపి పర్యటనకు వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఫెడరల్ ఫ్రంట్ పై పర్యటనల్లో భాగంగా ఏపిలో వైసిపి తో మంతనాలు ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా..వైసిపి అధినేత జగన్ కు కేసీఆర్ ఫోన్ చేసారు. తొలి దఫా చర్చల కోసం కేటిఆర్ బృందాన్ని పంపిస్తున్నామని..త్వరలోనే తాను విజ యవాడ వచ్చి కలిసి అన్ని విషయాలు చర్చిస్తామని చెప్పుకొచ్చారు. దీని మేరకు కేటీఆర్ బృందం లోటస్ పాండ్ లో జగన్ తో సమావేశమైంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న ఆలోచనలను జగన్ కు వివరించారు. కెటిఆర్ తో ఏపిలోని రాజకీయ అంశాల పైనా చర్చించినట్లు సమాచారం. ఇదే సమయంలో జగన్ - కేటీఆర్ భేటి పై టిడిపి నేతలు చేస్తున్న విమర్శల పైనా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ అంశాన్ని ఇరువురు నేతలు అంత సీరియస్ గా తీసుకోలేదు. జాతీయ స్థాయిలో ఎవరు కలిసొస్తున్నారనే అంశం పై జగన్ ఆరా తీసినట్లు సమాచారం.

ప్రత్యేక హోదా పై మార్పు లేదు : కేటీఆర్
ఏపికి ప్రత్యేక హోదా అంశంలో టిఆర్‌యస్ వైఖరిలో మార్పు లేదని టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ స్పష్టం చేసారు. ఇప్పటికే పార్లమెంట్‌లో కేశవరావు, కవిత ఏపికి హోదా అంశంలో మద్దతిచ్చారని..పార్టీ అధినేత కేసీఆర్ సై తం తాను ఇదే అంశం పై ప్రధానికి లేఖ రాయటానికి అభ్యంతరం లేదని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసారు. జగన్ సైతం హోదా ఏపికి ముఖ్యమైన అంశమని..ఇది సాధించటం కోసం ఏపికి చెందిన 25 మంది బలం సరిపోదని.. తెలంగాణ కు చెందిన మరో 17 మంది మద్దతు పెరిగితే.. సాధించే అవకాశాలు ఏర్పడుతాయని జగన్ వివరించారు. కేటీఆర్ ప్రతిపాదనల పై పార్టీలో చర్చిస్తామన్నారు. కేసీఆర్ తో చర్చల తరువాత ఈ అంశం పై మరింత స్పష్టత వస్తుందని..అప్పుడు నిర్ణయం తీసుకుంటామని జగన్ ప్రకటించారు.

ఏపి లో ఎంట్రీతో ఆట మొదలా..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఏపిలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా టిఆర్‌యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. విజయవాడలో కేసీఆర్ - జగన్ తో భేటీ అవుతారని ఆ సమయంలో అన్ని విషయాలు చర్చిస్తారని వెల్లడించారు. అయితే, చంద్రబాబు - కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరి స్తున్నారు. ఇద్దరు భిన్న ఫ్రంట్ లపై ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ ఎన్నికల ద్వారా చంద్రబాబు తో కేసీఆర్ కు మరింత గ్యాప్ పెరిగింది. కొద్ది రోజులుగా కేసీఆర్- జగన్ -మోదీ లను కలిపి ముగ్గురు మోదీలంటూ చంద్రబాబు విమర్శ లు చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ వద్దకు ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచారు. ఇప్పుడు నేరుగా విజయవాడకు వెళ్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ చర్చలు అని చెబుతున్నా..విజయవాడ నుండే చంద్రబాబు పై రాజకీయంగా పోరాటానికి కేసీఆర్ సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు జగన్- కేసీఆర్ మధ్య భేటీ అందు నా..విజయవాడ కేంద్రంగా జరిగే ఈ సమావేశం తో ఏపిలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications