ఇందిరలాంటి వారే క్షమాపణ చెప్పారు: రేవంత్‌పై కేసీఆర్

హైదరాబాద్: ఇందిరాగాంధీ అంతటి వారే తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పారని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి తప్పు చేశారని, క్షమాపణ చెప్పాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. టీడీపీ శాసన సభ్యుల సస్పెన్షన్‌కు ముందు కేసీఆర్ మాట్లాడారు.

వాడివేడి చర్చలు జరిగేటప్పుడు మాటలు దొర్లడం సహజమేనని, ఇందిర వంటి వారే తప్పు మాట్లాడారన్నారు. విద్యుత్ అంశం మీద సభను తప్పుదారి పట్టించిన రేవంత్ సభకు వందశాతం క్షమాపణ చెప్పాల్సిందే అన్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. తెరాస, టీడీపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేశారు.

 KCR asks Revanth Reddy's apology

బడ్జెట్‌ను చూసి ఇది కేసీఆర్ కుటుంబ బడ్జెట్‌లా ఉందని రేవంత్ వ్యాఖ్యానించడం తగదన్నారు. రేవంత్ అబద్దాలు మాట్లాడవద్దన్నారు. శాసన సభలో ఏది పడితే అది మాట్లాడటం ప్రతిపక్షాలకు మంచిది కాదని హితవు పలికారు. రేవంత్ నిజామాబాద్ ఎంపీ కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

శాసన సభలో మంత్రులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ తర్వాత ఆయన మాట్లాడారు. కొందరు సభ్యులు సభ లోపల, బయట అసభ్యంగా మాట్లాడుతున్నారన్నారు. హుందాగా మాట్లాడాలన్నారు.

ప్రభుత్వ విధానాల పైన కాకుండా వ్యక్తులను లక్ష్యంగా చేసి మాట్లాడటం సరికాదన్నారు. తమ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు ఆత్మహత్యల పైన అనుచితంగా మాట్లాడి ఉండరని కేసీఆర్ సభలో వివరణ ఇచ్చారన్నారు. హుందాతనం అంటే ఇది అన్నారు. మీరు కూడా అలాగే ప్రవర్తిస్తే బాగుంటుందన్నారు. గుండెలను గాయపరిచేలా మాట్లాడవద్దన్నారు. ఒకసారి గాయపడిన మనసును చల్లార్చలేరన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+