విభజన చట్టంలోని సెక్షన్ 8, అద్వానీ వ్యాఖ్య: కేసీఆర్‌ది పెద్ద వ్యూహమేనా?

హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ నుండి.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం సెక్షన్ 8 వరకు వెళ్లింది. సెక్షన్ 8 పైన ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆయా పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నాయి.

హైదరాబాదులో తమకు రక్షణ లేదని, ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాల్సిందేనని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఏపీ టీడీపీ నేతలకు తెలంగాణ టీడీపీ నేతలు కూడా మద్దతు పలుకుతున్నారనే చెప్పవచ్చు. అదే సమయంలో సెక్షన్ 8 అమలు చేస్తే మరో ఉద్యమం చూస్తారని తెలంగాణ హెచ్చరిస్తోంది.

సెక్షన్ 8 అమలు చేస్తే తాను ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా గవర్నర్ నరసింహన్‌తోనే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, హైదరాబాదులో ఆంధ్రులకు రక్షణ లేదనేందుకు పలు ఉదాహరణలు చూపిస్తూ ఏపీ టీడీపీ నేతలు సెక్షన్ 8కు డిమాండ్ చేస్తున్నారు.

సెక్షన్ 8 పైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్ర హోంశాఖ కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. సెక్షన్ 8 ప్రస్తుతం గవర్నర్ కోర్టులోనే ఉందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సెక్షన్ 8 అమలు కాకుండా ఉండేందుకు కేసీఆర్ పెద్ద వ్యూహమే రచిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

KCR big strategy on Section 8?

అనుకోని పరిస్థితుల్లో సెక్షన్ 8 అమలు చేయాలన్న ఆలోచన కేంద్రానికి వస్తే దానిని తిప్పికొట్టేందుకు కేసీఆర్.. ఓ అస్త్రంగా వాడుకోవాలని చూస్తున్నారని అంటున్నారు. సెక్షన్ 8 అమలు చేస్తే దీనిని రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనంగా చిత్రీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏఏపీ నేత అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని పోరాడుతున్నారు. ఇటీవల బీజేపీ అగ్రనేత అద్వానీ.. మళ్లీ భారత్‌లో ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమని చెప్పారు.

దానికి అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. అందుకు ఢిల్లీయే ఉదాహరణ అని ట్వీట్ చేశారు. తద్వారా ఢిల్లీ పైన కేంద్రం పెత్తనం సాగిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నితీష్, కాంగ్రెస్ వంటి బీజేపీ లేదా మోడీ వ్యతిరేకులు అద్వానీ వ్యాఖ్యలకు పలు అర్థాలు తీశారు. అద్వానీ వ్యాఖ్యలు మోడీకేనని అభిప్రాయపడ్డారు.

ఇప్పుడు కేసీఆర్ కూడా సెక్షన్ 8 అమలు చేస్తే దానిని రాష్ట్రాల పైన కేంద్రం పెత్తనంగా జాతీయస్థాయికి తీసుకు వెళ్లాలని భావిస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీ పునర్విభజన చట్టంలో ఏం చెబుతుందనే విషయాన్ని పక్కన పెట్టి నితీష్, కేజ్రీవాల్, మమత, మాయావతి వంటి వారు కేసీఆర్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

సెక్షన్ 8 అమలుకు కేంద్రం మొగ్గు చూపితే మాత్రం దానిని రాష్ట్రాల పైన కేంద్రం పెత్తనంగా చూపించాలని కేసీఆర్ భావిస్తున్నారని అంటున్నారు. కేసీఆర్‌కు మోడీ లేదా కేసీఆర్ వ్యతిరేకులు వంతపాడే అవకాశాలు ఎవరూ కొట్టిపారేయలేరు. అయితే, పునర్విభజన చట్టంలో సెక్షన్ 8 ఉండటం గమనార్హం.

హైదరాబాదులో పరిస్థితులు అదుపుతప్పినప్పుడే సెక్షన్ 8 అమలు చేయాల్సి ఉంటుందని తెరాస నేతలు చెబుతున్నారు.

తమకు రక్షణ లేకుండా పోయిందని అందుకే సెక్షన్ 8 అమలు డిమాండ్ చేస్తున్నామని ఏపీ టీడీపీ నేతలు చెబుతున్నారు. సెక్షన్ 8 అమలు చేయకుంటే సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం గమనార్హం. పునర్విభజన చట్టంలో ఉన్న సెక్షన్ 8 చెల్లదంటే ఏపీ విభజన చెల్లదనేది ఏపీ నేతల వాదన.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+