మీడియాకు దూరం: అసెంబ్లీలో 'దడి కట్టిన' కెసిఆర్

హైదరాబాద్: మీడియాకు తాను గానీ మంత్రులు గానీ ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో రాకుండా తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చర్యలు తీసుకున్నారు. గతంలో పాసులు ఉంటే మీడియా ప్రతినిధులు శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం వరకు వెళ్లడానికి అవకాశం ఉండేది. కార్యాలయంలోకి వెళ్తున్నప్పుడు గానీ అందులోంచి బయటకు వస్తున్నప్పుడు గానీ మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి అవకాశం ఉండేది.

అయితే, ఏమైందో తెలియదు గానీ మీడియా ప్రతినిధులకు సులభంగా మంత్రులు, శాసనసభ్యులు, శాసనశభకు వచ్చే ఉన్నతాధికారులు అందుబాటులోకి రాకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి చేంబర్స్ ప్రవేశ ద్వారం వద్దకు, దానికి ఎదురుగా ఉన్న లాబీలోకి రాకుండా మధ్యలో పార్టిషన్ ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు ముఖ్యమంత్రితో మాట్లాడడానికి అవకాశం లేకుండా అక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.

KCR blocks access to media in his assembly chambers

ఆహ్వానిస్తే తప్ప మీడియా ప్రతినిధులు ఇప్పుడు ముఖ్యమంత్రి చేంబర్స్‌కు వెళ్లే అవకాశం ఉండదు. మీడియా ప్రతినిధులు తన గది వద్దనే తచ్చాడుతూ, గదిలోకి వెళ్తున్నప్పుడూ బయటకు వస్తున్నప్పుడూ మీడియా ప్రతినిధులు పలకరిస్తుండడం కెసిఆర్‌కు నచ్చలేదని, అది ఇబ్బందిగా మారి ఉంటుందని అంటున్నారు.

శాసనసభా కార్యక్రమాలనూ చూడడానికి చిన్నపాటి మీడియా లాంజ్ ఏర్పాటు చేశారు. క్యాంటీన్‌ను తగ్గించారు, కుర్చీలు కూడా తగ్గాయి. అసెంబ్లీలోకి ప్రవేశాన్నే పరిమితం చేశారు. ఎంపిక చేసిన పాస్ హోల్డర్లను మాత్రమే లాబీలోకి, గ్యాలరీలోకి అడుగు పెట్టనిస్తున్నారు.

ఇక మీడియా పాయింట్ ఒక్కటే మిగిలింది. అధికార, ప్రతిపక్ష సభ్యులు మీడియా పాయింట్ వద్దకు వచ్చి మీడియా ప్రతినిధులతో మాట్లాడితే తప్ప ఏం జరుగుతుందనేది తెలియడానికి వీలు లేకుండా పోయింది. గతంలోని ఉత్సుకతకు, ఊహాగానాలకు మాత్రం దాని వల్ల తెర పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+