Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భయపడను బుల్లెట్‌లా దూసుకెళ్తా, కేసీఆర్‌పై కేసు పెట్టాలి: బాబు, ప్రభుత్వంచే ఆ వీడియోలు రిలీజ్

చేబ్రోలు: తాను ఎవరికీ భయపడనని, బుల్లెట్‌లా దూసుకుపోతానని, తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న తెరాస పైన కేసు పెట్టాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. తూర్పు గోదావరి జిల్లా చేబ్రోలులో చంద్రబాబు జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కేబినెట్లో చేర్చుకోవడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ పైన కేసు పెట్టాలని భగ్గుమన్నారు. తెరాస నీతిమాలిన పనులు చేస్తోందన్నారు.

KCR conspiracy on TDP: Chandrababu

తెలంగాణలో టీడీపీ ఉండకూడదనే కక్షతో టీఆర్ఎస్ వెళ్తోందన్నారు. 16 కేసుల్లో నిందితుడిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రేవంత్ వ్యవహారంపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస రావు విజయవాడలో మాట్లాడారు.

ఆ సీడీలను ఏసీబీ విడుదల చేయలేదని, ప్రభుత్వమే విడుదల చేసిందని తెలుస్తోందన్నారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్‌కు 85 ఓట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. రేవంత్ వ్యవహారంలో తెరాస కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబుపై కేసు పెట్టాలనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఏపీ మంత్రి యనమల అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+