సీఎం రాకకోసం చూసిన నేతలపై తేనెటీగల దాడి, పరుగు: తట్ట ఎత్తిన కేసీఆర్ (పిక్చర్స్)
మెదక్: జిల్లా గజ్వెల్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హెలిపాడ్ వద్ద తేనెటీగలు దాడికి దిగాయి. ఒక్కసారిగా తేనేటీగలు రావడంతో.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు పెట్టారు.
తేనెటీగల నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నించారు. పలువురికి గాయాలయ్యాయి. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ రాముల్ నాయక్, మాజీ ఎమ్మెల్యే ఆర్ సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ బొజ్జతో సహా పలువురికి గాయాలయ్యాయి.
కాగా, కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వెల్లో పర్యటించారు. గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రి, ఎస్సీ కాలనీను పరిశీలించారు. గజ్వెల్లో నిర్మించే ఆడిటోరియం, రైతు బజార్ స్థలాలను చూశారు. పాండవుల చెరువును కూడా సందర్శించారు. అంతకుముందు కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలలో మిషన్ కాకతీయను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

కేసీఆర్
వెయ్యేళ్ల కిందట కాకతీయ రెడ్డి రాజులు 70, 80 వేల చెరువులకు గొలుసుకట్ట నిర్మాణాలు చేశారని దానివల్ల తెలంగాణలో రైతాంగానికి 15, 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్
ఆ నీరు అంతా ఎక్కడికిపోయిందో తెలంగాణ ప్రజలు ఆలోచించాలన్నారు. గురువారం నిజామాబాద్‌లోని మిషన్ కాకతీయ పైలాన్‌ను ఆవిష్కరించిన ఆయన మట్టి తట్టను మోసారు.

కేసీఆర్
శత్రురాజులు రాజ్యాలను ఆక్రమించుకున్నా పరవాలేదని, చెరువుల జోలికి వెళ్లవద్దని రాజులు విజ్ఞప్తి చేశారని కేసీఆర్ గుర్తుచేశారు. నిజంగానే శత్రురాజులు సైతం ఆ చెరువులను ధ్వంసం చేయలేదన్నారు.

కేసీఆర్
ఆంధ్రాలో తెలంగాణ కలిసిన తరువాత మన చెరువులన్నీ పాడైపోయాయన్నారు. 60 ఏళ్ల చిలుము ఒక్క రోజులో వదలదని గత పాలకులు చెరువుల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు.

కేసీఆర్
మన తెలంగాణ తెచ్చుకుందామని ఉద్యమ సందర్భంగా చెప్పామని, అలాగే తెలంగాణ వచ్చింది కాబట్టి మన చెరువులను బాగుచేసుకుందామన్నారు. బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకుందామన్నారు.

కేసీఆర్
చెరువుల పునరుద్ధరణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 46 వేల చెరువులలో పూడిక పనులు చేపట్టవలసి ఉందని చెప్పారు. ఆ పనులు పూర్తైతే మనకు నీరు సమృద్ధిగా ఉంటుందన్నారు.

కేసీఆర్
రైతులకు ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. వీటికి ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చునని, నాసిరకం పనులు చేపడితే ఎవరికైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేసీఆర్
చెరువుల పునరుద్ధరణ పవిత్ర యజ్ఞంలా భావించాలన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గ అభివృద్ధి పనులకు రూ. 30 కోట్ల నిధులు సరిపోవని, మరో రూ. 30 కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం జీవో విడుదల చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications