హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాముడిగా కెసిఆర్: బైక్‌పై దూసుకెళ్లిన కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు బుధవారం గులాబీ మయమైంది. తెలంగాణలో రాష్ట్రంలోనే అడుగిగుడుతానని ప్రకటించి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్లర చంద్రశేఖర రావు మధ్యాహ్నం హైదరాబాదులో విజయవంతంగా అడుగు పెట్టారు.

కెసిఆర్‌కు తెలంగాణవాదులు, తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభం, బతుకమ్మలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వేచ్ఛాగీతికలకు చిహ్నంగా పావురాలను ఎగురవేశారు.

బేగంపేట పరిసరాల్లో గులాబీ పూలవర్షం కురిపించారు. ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, వందల వాహనాలు కనిపించాయి. తెలంగాణలోని పది జిల్లాల నుండి తెరాస కార్యకర్తలు పోటెత్తారు.

జన సమూహం

జన సమూహం

కెసిఆర్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి ఘనస్వాగతం పలికింది. బతుకమ్మ ఆటలు, పోతరాజుల విన్యాసాలు, బోనాలు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతాలు, గొండు నృత్యాలు మొత్తం తెలంగాణ సంస్కృతి రాజధాని నగరానికి తరలి వచ్చినట్లుగా ఉంది.

కవిత

కవిత

ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన కెసిఆర్‌కు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో భారీ స్వాగతం పలికారు.

బైక్ పైన కవిత

బైక్ పైన కవిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళుతున్నాను, తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతాను అని ఢిల్లీ వెళ్లడానికి ముందు విలేఖరులతో ధీమాగా ప్రకటించిన కెసిఆర్ అన్నమాట ప్రకారం బిల్లు ఆమోదం పొందిన తరువాతనే నగరానికి చేరుకున్నారు.

శ్రీరాముడిగా...

శ్రీరాముడిగా...

సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అటు నుంచి ప్రత్యేక చార్టర్డ్ విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.

తెరాస

తెరాస

ఇక్కడ పార్టీ శ్రేణులు, మహిళా విభాగం కెసిఆర్‌కు తిలకం దిద్ది స్వాగతం పలికారు. నాలుగున్నర ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో కెసిఆర్ ర్యాలీగా గన్‌పార్క్‌కు బయలు దేరారు.

టిఆర్ఎస్

టిఆర్ఎస్

ప్రత్యేకంగా రూపొందించిన వాహనంలో కెసిఆర్‌తో పాటు పార్టీ నాయకులు కె కేశవరావు, మందా జగన్నాధం, వివేక్, నాయిని నర్సింహ్మా రెడ్డి ఉన్నారు.

గులాబీమయం

గులాబీమయం

టిఆర్‌ఎస్ శ్రేణులతో పాటు, తెలంగాణ వాదులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. లంబాడీ నృత్యాలు, ఆదిలాబాద్ గొండు నృత్యాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

బతుకమ్మతో ఆహ్వానం

బతుకమ్మతో ఆహ్వానం

దారి పొడవునా కెసిఆర్ బృందంపై అభిమానులు పూలు చల్లారు. తెలంగాణ జాతి పిత, అహింసా పోరాటం ద్వారా తెలంగాణ సాధించిన విజేత అంటూ దారి పొడవునా అభిమానులు నినాదాలు చేశారు.

ఆహ్వానం

ఆహ్వానం

బేగంపేట నుంచి గన్‌పార్క్ వరకు దారి పొడవునా కెసిఆర్‌కు స్వాగతం పలుకూత బ్యానర్లు ఏర్పాటుచేశారు. ఈ ర్యాలీ సందర్భంగా ట్రాఫిక్‌ను దారి మళ్లీంచారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.

ఒంటెపై

ఒంటెపై

నగర చరిత్రలో నిలిచిపోయే విధంగా స్వాగత ఏర్పాట్లు ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా స్వాగత సన్నాహాలు చేశారు.

కెకెతో కెసిఆర్

కెకెతో కెసిఆర్

గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపాన్ని పూల మాలలతో, విద్యుత్ దీపాలతో అలంకరించారు. అమర వీరుల స్థూపానికి కెసిఆర్ నివాళి అర్పించారు.

వాహనంపై

వాహనంపై

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, టిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళి అర్పించారు. అటు నుంచి కెసిఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లి తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.

ఢిల్లీలో కెసిఆర్

ఢిల్లీలో కెసిఆర్

గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు తెలంగాణ శ్రేణులు, తెలంగాణవాదులు జననీరాజనం పట్టారు. 25 రోజుల తర్వాత నగరానికి వచ్చిన ఆయనకు పూలవర్షంతో స్వాగతం పలికారు.

English summary
Enthusiastic activists of the TRS painted Hyderabad pink as they accorded the party's founder-chief Kalvakuntala Chandrasekhara Rao an unprecedented welcome on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X