వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాళోజీ కళాక్షేత్రం: కెసిఆర్‌కు తిలకం (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

వరంగల్: కాళోజీ ‘నా గొడవ'లో తన గొడవ ఏమి లేదని ప్రజల గొడవనే ఆయన గొడవగా చెప్పిన మహనీయుడని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. కాళోజీ ఒక్క వరంగల్‌కు, రాష్ట్రానికి, దేశానికి మాత్రమే పరిమితం కాదని ఆయన విశ్వమానవుడని, ఆయన కవిత్వం విశ్వజనీనమని పేర్కొన్నారు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం కెసిఆర్ ప్రసంగించారు.

కాళోజీ వ్యక్తిత్వానికి కొలమానం లేదన్నారు. ఆయన ఏ సందర్భంలోనూ రాజీపడని వ్యక్తని కొనియాడారు. కాళోజీ ముక్కు సూటి మనిషని అన్నారు. కాళోజీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుందని ప్రొఫెసర్ జయశంకర్ చెబుతూ ఉండేవారని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. రవీంద్రభారతిని మించిన ఏసీ కళాక్షేత్రం కాళోజీ పేరుతో నిర్మిస్తామన్నారు. ఆయన పేరుతో గ్రంథాలయం, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

వరంగల్‌లో అందమైన తోటలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రం కోసం రూ. 12కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కాళోజీ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమం ప్రారంభసమయంలో కాళోజీ ఎంతో స్ఫూర్తినిచ్చారన్నారు. కాళోజీ రచనలు ఇతర భాషల్లో అనువదించి అంతర్జాతీయ గుర్తింపు తేవాలని కెసిఆర్ సూచించారు. కేబినెట్, కేంద్రంతో చర్చించి కాళోజీ పేరున స్టాంపు విడుదల చేయిస్తామన్నారు. కాళోజీ జయంతి రోజే తెలంగాణ భాషాదినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లో కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేసిన అనంతరం కెసిఆర్ ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

కాళోజీ ‘నా గొడవ'లో తన గొడవ ఏమి లేదని ప్రజల గొడవనే ఆయన గొడవగా చెప్పిన మహనీయుడని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కాళోజీ ఒక్క వరంగల్‌కు, రాష్ట్రానికి, దేశానికి మాత్రమే పరిమితం కాదని ఆయన విశ్వమానవుడని, ఆయన కవిత్వం విశ్వజనీనమని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కాళోజీ వ్యక్తిత్వానికి కొలమానం లేదన్నారు. ఆయన ఏ సందర్భంలోనూ రాజీపడని వ్యక్తని కొనియాడారు. కాళోజీ ముక్కు సూటి మనిషని అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

రవీంద్రభారతిని మించిన ఏసీ కళాక్షేత్రం కాళోజీ పేరుతో నిర్మిస్తామన్నారు. ఆయన పేరుతో గ్రంథాలయం, ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.

కెసిఆర్

కెసిఆర్

వరంగల్‌లో అందమైన తోటలా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మిస్తామన్నారు. కాళోజీ కళాక్షేత్రం కోసం రూ. 12కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

రానున్న రోజుల్లో కాళోజీ పేరుతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.
తెలంగాణ ఉద్యమం ప్రారంభసమయంలో కాళోజీ ఎంతో స్ఫూర్తినిచ్చారన్నారు.

కెసిఆర్

కెసిఆర్

కాళోజీ రచనలు ఇతర భాషల్లో అనువదించి అంతర్జాతీయ గుర్తింపు తేవాలని కెసిఆర్ సూచించారు.

కెసిఆర్

కెసిఆర్

కేబినెట్, కేంద్రంతో చర్చించి కాళోజీ పేరున స్టాంపు విడుదల చేయిస్తామన్నారు. కాళోజీ జయంతి రోజే తెలంగాణ భాషాదినోత్సవం నిర్వహిస్తామని చెప్పారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Tuesday inaugurated Kaloji Kala Kendram in Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X