'రేవంత్‌పై కుట్ర, వైఎస్‌ను మించిపోయిన కేసీఆర్', గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేతలు సీతక్క, రాజేందర్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. మత్తయ్యను పట్టుకోకపోవడం వ్యూహాత్మకమే అన్నారు.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీకి)కి కేసీఆఱ్ ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. కేసులో ఏ 4గా ఉన్న మత్తయ్యను పట్టుకోకపోవడం ఎవరి వ్యూహమో చెప్పాలన్నారు. కేసీఆర్‌ను ప్రశ్నించినందుకే రేవంత్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.

ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేయడం ఓ కుట్ర అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో కేసీఆర్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని మించిపోయారని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.
గవర్నర్‌తో కేసీఆర్ భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిణామాల పైన కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications