Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నయా రజాకార్లు: కెసిఆర్‌పై రాపోలు, రజ్వీ వారసులని..

 KCR is 'Naya rajakar' says Rapolu
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుసభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కెసిఆర్ ప్రభుత్వం నయా రజాకార్ల వ్యవస్థగా మారిందని, తెలంగాణ రాష్ట్ర నాయకులు ఖాసీం రజ్వీ వారసులని ఆయన విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బృందం, తెలంగాణ స్వాతంత్ర్య సేనాని సమితి ఆధ్వర్యంలో కోఠిలోని అమరవీరుల స్తూపం వద్ద బుధవారం తెలంగాణ ఆత్మగౌరవ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సారథ్య బృందం అధ్యక్షుడైన రాపోలు ఆనందభాస్కర్, తదితర నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం కెసిఆర్ ప్రభుత్వ అవకాశవాదానికి నిదర్శనమని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కెసిఆర్ అవకాశవాద రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని తెలంగాణ పిసిసి అధ్యక్షు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ వల్లే ఏర్పడిందని చెప్పారు.

ప్రజాతీర్పును స్వాగతీస్తున్నాం: జానారెడ్డి

మెదక్ ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్‌ను ప్రజలు నమ్మినంతకాలం ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు. హామీలన్నింటినీ అమలు చేసి ఆ పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా తమకు అభ్యంతరం లేదని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+