అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటుకు నోటు కేసుపై ఉత్కంఠ: ఏం జరుగుతోంది, చంద్రబాబు ప్లాన్ ఏంటీ?

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి భవిష్యత్‌పై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేసే క్రమంలో బయటపడిన ఆడియో టేపుల వ్యవహారంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగిసినట్టేనన్న చర్చ ఊపందుకుంది.

వైపీసీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌తో ఓటుకు కేసు కొత్త మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. రామకృష్ణారెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు ఆదేశాలతో దర్యాప్తు సంస్థపైనా ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాల మేరకు న్యాయపరంగానే ముందుకు వెళుతామని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కావడం, అనంతరం ఏజీ రామకృష్ణారెడ్డి, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గవర్నర్‌ను విడిగా కలువడం కలకలం రేపింది. జీఎస్టీ బిల్లు కోసం అసెంబ్లీ ఏర్పాటుతో పాటు ఓటుకు నోటు కేసులో తాజా పరిణామాలను ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అనంతరం ఏజీ రామకృష్ణారెడ్డి, ఏసీబీ డీజీ ఏకేఖాన్ కూడా గవర్నర్‌తో ఈ కేసు విషయంలో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. కోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని, దీనిపై న్యాయ సలహా కూడా తీసుకుంటున్నామని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

ఈ భేటీలతో ఏం చర్చించారనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం. బయటకు గాంభీర్యం ప్రదర్శిస్తూనే, లోపల మాత్రం వణికిపోతున్నారని సమాచారం. గవర్నర్‌తో తెలంగాణ సీఎం, పోలీసు ఉన్నతాధికారుల భేటీకి సంబంధించిన వివరాలను ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు చంద్రబాబుకు నివేదిస్తున్నారని సమాచారం.

ఓటుకు నోటు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడిన సంభాషణ చంద్రబాబుదే అని ముంబైకి చెందిన హెలిక్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో బయటపడింది. ఈ నివేదికతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయడం, నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఏసీబీ కోర్టు ఆదేశించడం తెలిసిందే. ఆ మేరకు చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, విచారించేందుకు ఏసీబీ సిద్ధమవుతోందని సమాచారం.

ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు తప్పదా?

ఎఫ్‌ఐఆర్‌లో బాబు పేరు తప్పదా?


గతేడాది దాఖలుచేసిన చార్జిషీట్‌లోనూ 33సార్లు చంద్రబాబు పేరును ఏసీబీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనితో ఏ విధంగా చూసినా చంద్రబాబును విచారించక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఏసీబీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. విచారణలో చంద్రబాబు చెప్పే అంశాలను బట్టి.. నివేదిక తయారు చేసి, కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల 29లోపు అందించాల్సి ఉంటుందని తెలిపారు. అలా చేయని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద తాము న్యాయస్థానం ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని తెలిపారు.

ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏమంటున్నారు?

ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు ఏమంటున్నారు?


ఓటుకు నోటు కేసులో జరుగుతున్న దర్యాప్తు తీరు, కోర్టు ఆదేశాలను బట్టిచూస్తే వంద శాతం చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడం ఖాయమని ఏపీ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ కీలక అధికారి మీడియాతో వెల్లడించారు. చట్టప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదుచేసిన తర్వాత విచారణకు నోటీసులిచ్చే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుందని ఆయన తెలిపారు.

 చంద్రబాబు సీనియర్ సిటిజన్

చంద్రబాబు సీనియర్ సిటిజన్


చంద్రబాబు సీనియర్ సిటిజన్, పైగా ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడంతో ఆయన ఇంటికి వెళ్లి విచారించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఆర్పీసీ ప్రకారం 60 ఏళ్లు దాటిన వారిని పోలీస్ స్టేషన్‌కు, దర్యాప్తు సంస్థ వద్దకు పిలువడం కుదరదని ఆయన చెప్పారు. అందువల్ల నేరుగా చంద్రబాబు ఇంటికి వెళ్లి కేసు విషయంలో విచారణకు సహకరించేలా విజ్ఞప్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ ఆయన సహకరించకపోతే కోర్టు ద్వారా అరెస్ట్ వారెంట్ జారీచేసే అధికారం కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు.

 హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు!

హైకోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు!

ఓటుకు నోటు కేసులో తనపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలన్న దానిపై ఏపీ ఇంటెలిజెన్స్, న్యాయ నిపుణులతో ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం రాత్రి చర్చించినట్టుగా మీడియాలో వార్తుల వస్తున్నాయి. ఎఫ్‌ఐఆర్‌లో పేరు నమోదు చేస్తే ఎలాగైనా విచారణను ఆపించేందుకు ప్రయత్నించాలని, ఇందుకు ఉన్న మార్గాలపై బుధవారం ఉదయానికల్లా తనకు చెప్పాలని ఆదేశించారని తెలుస్తోంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత హైకోర్టు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా చంద్రబాబు ఆదేశించారని సమాచారం.

English summary
KCR meets governor on cash for vote scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X