కెసిఆర్ భేటీ: సోలార్ కేంద్రానికి గోయల్ సై (పిక్చర్స్)

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌లో వేయి మెగావాట్ల సోలార్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో భేటీ అనంతరం ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.

కేంద్ర, రాష్ట్రాల సహకారంతో విద్యుత్తు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేయాలని విభజన బిల్లులో ఉందని ఆయన చెప్పారు.

తొలి దశలో 1,320 మెగావాట్ల విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. పియూష్ గోయల్‌ను కలవడానికి ముందు కెసిఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణకు సంబంధించిన విషయాలను వివరించారు.

ప్రధానికి పుష్పగుచ్ఛం

ప్రధానికి పుష్పగుచ్ఛం

ఢిల్లీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

విన్నపాల చిట్టా..

విన్నపాల చిట్టా..

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని మోడీని కలిసి తెలంగాణకు కావాల్సిన అంశాలపై వివరించారు.

పియూష్ గోయల్‌తో భేటీ

పియూష్ గోయల్‌తో భేటీ

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని మోడీని కలిసిన తర్వాత కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పియూష్ గోయల్‌తో సమావేశమయ్యారు.

ఢిల్లీకి ఇలా వచ్చారు...

ఢిల్లీకి ఇలా వచ్చారు...

తెలంగాణకు కావాల్సిన వాటిని రాబట్టుకోవడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఢిల్లీకి చేరుకున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+