తెలంగాణ దూరదర్శన్ పేరు యాదగిరి, కేసీఆర్ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణ దూరదర్శన్ చానల్‌కు యాదగిరి అని నామకరణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయించారు. సెప్టెంబర్ 27 నుంచి తెలంగాణ దూరదర్శన్ 'యాదగిరి' ప్రసారాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ భాష, యాస, సంస్కృతి, సంప్రదాయాలకు దూరదర్శన్ 'యాదగిరి' చానల్ అత్యంత ప్రాముఖ్యం ఇవ్వాలని కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా 'యాదగిరి' చానల్ నిలవాలన్నారు. ముఖ్యమంత్రిని బుధవారం దూరదర్శన్ అధికారులు కలిశారు.
పౌర సరఫరాలపై కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు: ఈటెల

పౌరసరఫరాలపై కేబినెట్ సబ్ కమిటీ కసరత్తు చేస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడారు. రేషన్ బియ్యం రూపాయికి ఇవాలా? ఉచితంగా ఇవ్వాలా అనే దానిపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
తెలంగాణలో 12 లక్షల బోగస్ రేషన్ కార్డులను గుర్తించినట్లు తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయంపై చర్చిస్తున్నామన్నారు. హోంగార్డుల జీతభత్యాలను నాన్‌ప్లాన్ బడ్జెట్‌లో పొందుపరుస్తామని మంత్రి ఈటెల తెలిపారు.












Click it and Unblock the Notifications