వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గురువు జీవితాన్నిస్తడు: కెసిఆర్, శని కావొద్దని(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అమ్మ మనకు జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. మనిషికి మొదటి బడి అమ్మ ఒడి అని కెసిఆర్ అన్నారు. శుక్రవారం రవీంధ్రభారతిలో జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కెసిఆర్ ప్రసంగించారు. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిరస్మరణీయులని అన్నారు. మన దేశంలో గురువుకు మహోన్నత స్థానం ఉందని చెప్పారు.

ఒకసారి సర్వేపల్లికి ఆయన శిశ్యులు సన్మానం చేసేందుకు సిద్ధమవగా తనకు రాష్ట్రపతిగా సన్మానిస్తున్నారా? లేక ఉపాధ్యాయుడిగా సన్మానిస్తున్నారా? అని ప్రశ్నించారని చెప్పారు. ఇందుకు సమాధానంగా శిశ్యులు ఆయనను రాష్ట్రపతి పదవి చేపట్టిన గురువును సన్మానిస్తున్నామని చెప్పారని తెలిపారు. తన గురువు మృత్యుంజయశర్మ వద్ద చదువుకోవడం తన అదృష్టమని చెప్పారు. ఆయన ఎంతో కమిట్మెంటుతో బోధన చేసేవారని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని చెప్పారు. తనపై అమ్మవారి దయ ఉందని ఆయన చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.

తాను దుబ్బాక పాఠశాలలో చదువుకున్నాని తెలిపారు. ఉపాధ్యాయుల కారణంగా ఆ పాఠశాలకు అప్పట్లో గొప్ప పేరుండేదని తెలిపారు. మృత్యుంజయ శర్మ సార్ వల్లే తాను తెలుగు సాహిత్యంలో పట్టుసాధించినట్లు కెసిఆర్ తెలిపారు. తనకు 9వ తరగతిలోనే ప్రబంధం, కావ్యం అంటే తెలుసని చెప్పారు. అంతేగాక 9వ తరగతిలోనే చంపకమాల పద్యం రాసినట్లు చెప్పారు. గురువులు గొప్పగా చెప్తే బృహస్పతి అవుతారన్న ఆయన.. బోధనకు దూరంగా ఉంటే శనిగ్రహం అవుతారని అన్నారు. అందుకోసం టీచర్లు బోధనపై దృష్టి సారించాలని సూచించారు.

ఉచిత నిర్బంధ విద్య అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని కెసిఆర్ చెప్పారు. వచ్చే ఏడాదిలోగా దశలవారీగా అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్ల పాత్ర అనన్య సామాన్యమని చెప్పారు. తెలంగాణ టీచర్లు ఇంగ్లీష్‌లో ఉచిత నిర్బంధ విద్యకు సహకరించాలని కోరారు. ఇంగ్లీష్‌లో బోధన చేయడమనేది బ్రహ్మ విద్యేం కాదని అన్నారు. తాను కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదని చెప్పారు. తాము చదువుకునే రోజుల్లో ఇంగ్లీష్ నిషేధిత భాష అని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

అమ్మ మనకు జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. మనిషికి మొదటి బడి అమ్మ ఒడి అని కెసిఆర్ అన్నారు.

కెసిఆర్

కెసిఆర్

శుక్రవారం రవీంధ్రభారతిలో జరిగిన ఉపాధ్యాయుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కెసిఆర్ ప్రసంగించారు.

కెసిఆర్

కెసిఆర్

ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిరస్మరణీయులని అన్నారు. మన దేశంలో గురువుకు మహోన్నత స్థానం ఉందని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

ఒకసారి సర్వేపల్లికి ఆయన శిశ్యులు సన్మానం చేసేందుకు సిద్ధమవగా తనకు రాష్ట్రపతిగా సన్మానిస్తున్నారా? లేక ఉపాధ్యాయుడిగా సన్మానిస్తున్నారా? అని ప్రశ్నించారని చెప్పారు. ఇందుకు సమాధానంగా శిశ్యులు ఆయనను రాష్ట్రపతి పదవి చేపట్టిన గురువును సన్మానిస్తున్నామని చెప్పారని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

తన గురువు మృత్యుంజయశర్మ వద్ద చదువుకోవడం తన అదృష్టమని చెప్పారు. ఆయన ఎంతో కమిట్మెంటుతో బోధన చేసేవారని తెలిపారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

తాను దుబ్బాక పాఠశాలలో చదువుకున్నాని తెలిపారు. ఉపాధ్యాయుల కారణంగా ఆ పాఠశాలకు అప్పట్లో గొప్ప పేరుండేదని తెలిపారు. మృత్యుంజయ శర్మ సార్ వల్లే తాను తెలుగు సాహిత్యంలో పట్టుసాధించినట్లు కెసిఆర్ తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

తనకు 9వ తరగతిలోనే ప్రబంధం, కావ్యం అంటే తెలుసని చెప్పారు. అంతేగాక 9వ తరగతిలోనే చంపకమాల పద్యం రాసినట్లు చెప్పారు.

కెసిఆర్

కెసిఆర్

గురువులు గొప్పగా చెప్తే బృహస్పతి అవుతారన్న ఆయన.. బోధనకు దూరంగా ఉంటే శనిగ్రహం అవుతారని అన్నారు. అందుకోసం టీచర్లు బోధనపై దృష్టి సారించాలని సూచించారు.

విద్యా ప్రమాణాల విషయంలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులు తమ ప్రభుత్వం చేయదని చెప్పారు. తెలంగాణను సాధించుకున్నట్లే.. ఇంగ్లీష్ విద్య, ఉన్నత ప్రమాణాలను సాధించుకుందామని అన్నారు. తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టి పోరాటం చేస్తే ఏం దుకాణం పెట్టినవ్ అని అప్పుడు అన్నారని చెప్పారు. ఇప్పుడు ఆ దుకాణానికే నమస్తే పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యా కేంద్రంగా తెలంగాణ తయారుకావాలని కెసిఆర్ ఆకాంక్షించారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday participated in Teachers Day celebrations at Ravindra Bharati in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X