Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కెసిఆర్‌ ఇచ్చే రిట‌ర్న్ గిఫ్ట్ ఇదేనా : క‌లిసొచ్చేదెవ‌రికి : జ‌గ‌న్..ప‌వ‌న్ ల‌లో ఎవ‌రి వైపు..!

ఏపి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తాం..ఎన్నిక‌ల ప్ర‌చారం లో కెటిఆర్‌. చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాను..ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత కెసిర్‌. తెలంగాణ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు మ‌ద్ద‌తిచ్చి..తాము ఓడిపోవాల‌ని ప్ర‌య‌త్నించిన టిడిపి అధినేత చంద్ర బాబుకు ఎలాగైనా షాక్ ఇవ్వాల‌ని టిఆర్‌య‌స్ అధినేత భావిస్తున్నారు. ఇందు కోసం ఆయ‌న ఏం చేయ‌బోతున్నార‌నేది ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. చంద్ర‌బాబు ను రాజ‌కీయంగా దెబ్బ తీయాలంటే కెసిఆర్ ఏం చేస్తారు..చంద్ర‌బాబు కు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులుగా ఉన్న జ‌గ‌న్ -ప‌వ‌న్ ల‌లో ఎవ‌రికి మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నే చ‌ర్చ మొద‌లైంది...

Recommended Video

    KCR Press Meet : KCR Satirical Comments On Chandrababu Naidu | Oneindia Telugu

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018లో గెలిచిన అభ్యర్థులు (ఫోటోలు)

    తెలంగాణ ఎన్నిక‌ల్లో ఒన్ సైడ్ విక్ట‌రీ సాధించిన కెసిఆర్..ఏపి ముఖ్య‌మంత్రి గురించి చేసిన తాజా కామెంట్లు ఏపి లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపి రాజ‌కీయాల్లో వేలు పెడ‌తామని చెప్ప‌టం ద్వారా..రాజ‌కీయంగా కెసిఆర్ ఏం చేస్తార‌నే దాని పై ఇప్పుడు భిన్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఏపి రాజ‌కీయాల్లో టిఆర్‌య‌స్ నేరుగా పోటీ చేసే అవ‌కాశం లేదు. పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర స‌మితి కావ‌టంతో..రాజ‌కీయంగా ఏపి లో స‌మీక‌ర‌ణాలు కెసిఆర్ కు స‌రిపోయే ప‌రిస్థితి లేదు. ఇక‌, టిడిపి ని ఓడించాలంటే రాజ‌కీయంగా టిడిపి ప్ర‌త్య‌ర్ధులు ఎవ‌రైతే ఉన్నారో వారిని స‌మ‌ర్ధించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

    KCR return Gift for Chandra babu : whats the role of KCR in AP Politics..

    తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా వైసిపి..జ‌న‌సేన రెండు పార్టీలు ప‌రోక్షంగా టిఆర్‌య‌స్ గెలుపుకు స‌హ‌క‌రించాయ నే వాద‌న ఇప్ప‌టికే వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో..సీమాంధ్ర ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో వైసిపి కార్య‌క‌ర్త‌లు టిడిపికి వ్య‌తిరేకంగా..టిఆర్‌య‌స్ కు మ‌ద్ద‌తుగా త‌మ వంతు పాత్ర పోషించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, ఫ‌లితాలు వెల్ల‌డి త‌రువాత వారు వెళ్లి కెటిఆర్‌ను క‌లిసార‌ని..ఆ త‌రువాత కెసిఆర్ వ‌ద్ద‌కు వెళ్ల‌గా..అప్పుడు కూడా కెసిఆర్ తాను ఖ‌చ్చితంగా మీరు చేసిన స‌హాయానికి గాను తాను త‌న వంతు సాయం చేస్తానంటూ కొన్ని కీల‌క కామెంట్లు చేసిన‌ట్లు స‌మాచారం.

    ఎవ‌రికి మ‌ద్ద‌తు..

    తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ -వ‌ప‌న్ ఇద్ద‌రూ ప‌రోక్షంగా కెసిఆర్ వైపే నిల‌బ‌డ్డారు. ప‌వ‌న్ అభిమానులు సైతం టిఆర్‌య‌స్ కే ఓటు వేసార‌ని చెబుతున్నారు. కుకట్‌ప‌ల్లి వంటి ప్రాంతాల్లో అన‌ధికారికంగా జ‌రిగిన సామాజిక వ‌ర్గాల స‌మావేశాల్లో నూ కెటిఆర్ కు జ‌గ‌న్ -ప‌వ‌న్ మ‌ద్ద‌తు దారులు టిఆర్‌య‌స్ వైపే నిల‌బ‌డ్డారు. జ‌గ‌న్ తొలి నుండి కెసిఆర్ తో స‌న్నిహిత సంబంధాలే న‌డుపుతున్నారు. ప‌వ‌న్ సైతం కెసిఆర్ తో స‌ఖ్య‌త కోరుకుంటున్నారు. అయితే. 2014 ఎన్నిక‌ల్లోనే ఏపి లో వైసిపి గెలుస్తుంద‌ని కెసిఆర్ అప్ప‌ట్లో జోస్యం చెప్పారు. అయితే, ఇప్పుడు జ‌గ‌న్ కు మ‌రింత ఆద‌ర‌ణ పెరిగింద‌ని టిఆర్‌య‌స్ నేత‌లు అంత‌ర్గ‌త స‌మావేశాల్లో అంచ‌నా వేస్తున్నారు.

    KCR return Gift for Chandra babu : whats the role of KCR in AP Politics..

    ఏపిలో త‌మ ప్ర‌భావం ఎంత మేర ఉంద‌నే దాని కంటే..తాము ఇచ్చే మ‌ద్ద‌తు ద్వారా చంద్ర‌బాబు కు రాజ‌కీయంగా న‌ష్ట ప‌ర‌చాల‌నేది వారి ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. దీనికి తోడు తాము జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాల‌నుకుంటున్న ఫ్రంట్ లో వైసిపి సైతం చేరుతుంద‌నే అంచనా లో కెసిఆర్ ఉన్నారు. తెలంగాణ రాజకీయ వ్యూహాల్లో అప‌ర చాణక్యుడిగా పేరున్న కెసిఆర్‌..అదే స్థాయిలో రాజ‌కీయ వ్యూహాల్లో దిట్ట అయిన చంద్ర‌బాబును ఎలా ఇరుకున పెడ‌తారో.. ఏ ర‌కంగా ఏపి రాజ‌కీయాల్లో వ్య‌వ‌హ‌రిస్తారో అనేది ఇప్పుడు ఏపి పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.

    KCR return Gift for Chandra babu : whats the role of KCR in AP Politics..
    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+