ఆంధ్రలో గెలిచేది జగనే.. తేల్చేసిన కేసీఆర్
తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో తిరిగి జగనే సీఎం అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ ప్రముఖ వార్త ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయము అని దానిపై వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని.. ప్రజలు మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు.
ఇక కూతురు , ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై కూడా కేసీఆర్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనవసరంగా అమాయకులను శిక్షిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంతా బోగస్ అని, ఇదింతా కూడా ప్రధాని మోదీ సృష్టేనని కేసీఆర్ అన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. నా కూతురు కవితకు ఏమి తెలియదని, లిక్కర్ స్కామ్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కేసులో నా కూతురు కవితతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా కడిగిన ముత్యంలా బయటకు వస్తారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఓటుకు నోటు కేసులో పట్టించినందుకే.. రేవంత్ రెడ్డి నాపై కక్ష పెంచుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని..తాను మరోసారి సీఎంగా పని చేస్తానని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై కూడా ఆయన ఈ సందర్భంగా స్పందించారు. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్‌ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాయని... మీ అంచనా ప్రకారం ఏపీలో ఎవరు విజయం సాధిస్తారని యాంకర్ అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇస్తూ.. తనకున్న సమాచారం ప్రకారం ఏపీలో తిరిగి జగన్ అధికారం చేపడతారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications