అసలు ముందు: కేసీఆర్ 'పవర్' లెక్క, అడ్డుకున్న టీడీపీ

హైదరాబాద్: మనకు రావాల్సిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని, ఏపీ కుట్రల పైన తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శాసన సభలో అన్నారు. డిస్కంల ఒప్పదం ప్రకారం కొత్త ప్రాజెక్టులు, కొనసాగుతున్న ప్రాజెక్టులను పీపీఏలు వర్తిస్తాయన్నారు. కృష్ణపట్నంలో కేవలం ఒక్క యూనిట్లో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారన్నారు.

కృష్ణపట్నం నుండి మనకు 190 మెగావాట్ల విద్యుత్ మనకు రాకుండా ఏపీ అడ్డుకుంటోందన్నారు. ఎగువ, దిగువ సీలేరు, డొంకరాయిలో 725 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, సీలేరు, డొంకరాయిల నుండి మనకు 390 మెగావాట్ల విద్యుత్ రావాలని, దానిని కూడా అడ్డుకుంటున్నారన్నారు. హిందూజా నుండి 561 మెగావాట్ల విద్యుత్ రావాల్సి ఉందన్నారు. ఏపీ సర్కారు పీపీఏలను ఉల్లంఘించిందని, పీపీఏల రద్దును నీరజా మాథుర్ కమిటీ తప్పు పట్టిందన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందన్నారు. ఏపీ నుండి తెలంగాణకు 980 మెగవాట్ల విద్యుత్ రాకుండా అడ్డుకుంటోందన్నారు. ఓ వైపు విద్యుత్ రాకుండా అడ్డుకుంటూ మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు యాత్రలు చేస్తూ ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు. అందరం రాజకీయాలకు అతీతంగా మన రైతాంగాన్ని కాపాడుకుందామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను చర్చించుకొని పరిష్కరించుకుందామని తానే పూనుకున్నానని చెప్పారు.

KCR says Telangana betrayed in AP government

ఆగస్టు 15న రాజ్ భవన్లో తాను కలిసి, ఇచ్చిపుచ్చుకునే సంస్కారం ఉండాలని, కవ్వివంచుకోవద్దని గవర్నర్‌కు చెప్పానని, గవర్నర్ సంతోషపడ్డారన్నారు. చంద్రబాబు చెప్పిందొకటి, చేసిందొకటి అన్నారు. ఇంకా ఎంతో ఉందని, అసలు విషయాలు ముందు ముందు చెబుతానని అన్నారు. తాను ఢిల్లీకి పోలేదని బీజేపీ నేతలు పదేపదె చెబుతున్నారని, కానీ మోడీకి కంటిన్యూగా లేఖలు రాశానని, అక్కడి నుండి రిప్లై రాలేదన్నారు.

మనం బెగ్గర్స్‌ము కాదని, మనకు విద్యుత్ రెండు రకాలుగా రావాల్సి ఉందన్నారు. ఒకటి చట్టం ప్రకారం, రెండోది పెట్టుబడులు ఉన్నాయన్నారు. తెలంగాణకు ఎన్ని చాలా కష్టాలు ఉన్నాయన్నారు. ఏపీలో తెలంగాణ విపక్షకు గురైందన్నారు. కాబట్టి చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. అఖిలపక్షం ఢిల్లీకి వెళ్లి విద్యుత్ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకు వెళ్దామన్నారు. గతించిన ఏపీ ప్రభుత్వం తెలంగాణ పైన వివక్ష చూపిందన్నారు.

మనలో మనకు పరస్పరం చిల్లర రాజకీయాలు మంచిది కాదన్నారు. అఖిల పక్షం అంతా ఢిల్లీకి వెళ్లి విద్యుత్ కోసం విజ్ఞప్తి చేద్దామన్నారు. వచ్చే సంవత్సరం ఇంతలా విద్యుత్ కష్టాలు ఉండవన్నారు. ఇప్పుడు కరెంట్ కోతలు తగ్గాయని చెప్పారు. ఏపీ నుండి తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాలన్నారు. భూపాలపల్లిలో 600 మెగావాట్ల విద్యుత్ రాబోతుందన్నారు. వచ్చే మూడేళ్లలో 24 గంటల విద్యుత్ ఇస్తామన్నారు.

మణుగూరులో పెట్టాల్సిన ప్రాజెక్టును విజయవాడలో పెట్టారని ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కృష్ణపట్నంలో మన వాటా 550 మెగావాట్లు అని చెప్పారు. డిండి హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. శంకరపల్లి విద్యుత్ కేంద్రానికి ఇంత వరకు గ్యాస్ కేటాయించలేదన్నారు. ఏపీ ప్రభుత్వాలు తెలివి తక్కువ పని చేశాయన్నారు. విద్యుత్ సంక్షోభం వారసత్వంగా వస్తోందన్నారు. హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల్లో 20 నుండి 30 రోజులు మాత్రమే విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు.

గనులు ఇక్కడ ఉంటే ప్రాజెక్టులు ఏపీలో కట్టారన్నారు. బాబు తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండిపోవాలని కంకణం కట్టుకున్నారన్నారు. శ్రీశైలం, సాగర్ వద్ద విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ నానా యాగీ చేస్తున్నారన్నారు. సౌర విద్యుత్‌లో మనకు రావాల్సిన 307 మెగావాట్లు రావడం లేదన్నారు. మాచ్ ఖండ్, టీవీ డ్యాం నుండి 36 మెగావాట్ల విద్యుత్ రావాలన్నారు. కృష్ణపట్నంలో మనం హక్కుదారులం అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయం లెక్కలు చూసి తాను ఆశ్చర్యపోయానన్నారు.

సభలో లేని వారి పేరు...

చంద్రబాబు గురించి పదేపదే ప్రస్తావించడం పైన టీడీపీ అబ్యంతరం వ్యక్తం చేసింది. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ.. తాను స్పీకర్ అనుమతి తీసుకొని మాట్లాడుతున్నానని చెప్పారు. వాస్తవాలు వినే ఓపిక లేకుంటే ఎలా అన్నారు. ముక్కుపిండి మనకు రావాల్సిన విద్యుత్ తీసుకు వద్దామన్నారు. టీడీపీ సభ్యులు అదేపనిగా ఆందోళన వ్యక్తం చేయడంతో సభను టీ బ్రేక్ కోసం పది నిమిషాలు వాయిదా వేశారు.
వాస్తవాలు వినే ఓపిక లేకుంటే ఎలా,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+