సిఎంగా సచివాలయంలో కెసిఆర్: రుణమాఫీపై సంతకం!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో అడుగు పెట్టారు. బాధ్యతలు స్వీకరించారు. రైతు రుణమాఫీ పైన తొలి సంతకం చేయనున్నారు. అంతకుముందు సచివాలయంలోని నల్లపోచమ్మ ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. తాను ఉద్యోగులతో ఇంతకుముందు ఉన్నట్లే ఉంటానని చెప్పారు. సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందామని చెప్పారు.

గతంలో ప్రభుత్వాలు ఉద్యోగులు సమాజంలో భాగం కాదన్నట్లుగా వ్యవహరించాయన్నారు. తెరాస ప్రభుత్వం మాత్రం ఎంప్లాయిసీ ఫ్రెండ్లీ అన్నారు. ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా తనకు నేరుగా చెప్పవచ్చునని తెలిపారు. మన సామర్థ్యమేంటో ఇప్పుడు నిరూపించుకుందామన్నారు.

KCR signs on first file

మనకు ఎవరు బాసులు లేరని, ప్రజలే బాసున్నారు. తెరాస ప్రభుత్వం ఉద్యోగుల స్నేహశీలి అన్నారు. తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. పీఆర్సీని వెంటనే అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుదామని చెప్పారు.

తెరాస ప్రభుత్వంలో సమ్మెలు చేసే పరిస్థితిని కల్పించనని చెప్పారు. ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చి నిరూపిస్తామని చెప్పారు. నవ తెలంగాణలో ప్రతి చట్టాన్ని రూపొందించుకోవాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలోనే తెలంగాణను ధనవంత దేశంగా మార్చుదామన్నారు. కాగా, కెసిఆర్ కేబినెట్ తొలి సమావేశం కానుంది. ఈ కేబినెట్లో అసెంబ్లీ సమావేశాలు ఖరారు చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+