అసెంబ్లీలో కెసిఆర్: దండం పెట్టి, నవ్వుతూ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉల్లాసంగా కనిపించారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నుంచి ఆయన బడ్జెట్‌ను అందుకున్నారు. శాసనసభలోకి అడుగు పెట్టిన వెంటనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యులు లేచి నిలబడి అభివాదం చేశారు.
కెసిఆర్ తమ పార్టీ శాసనసభ్యులకు, ప్రతిపక్షాల సభ్యులకు నవ్వుతూ అభివాదం చేశారు. శాసనసభలోకి ఆయన గులాబీ కండువా మెడ మీద వేసుకుని వచ్చారు. తెరాస మంత్రులు, శాసనసభ్యులు కూడా అలాగే వచ్చారు.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఆయన దాదాపు గంట సేపు తన ప్రసంగాన్ని సాగించారు. కెసిఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని శ్రద్ధగా వింటూ కనిపించారు. బిఎసి సమావేశంలో కూడా కెసిఆర్ పాల్గొన్నారు. అయితే, టిడిపి సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనతో వాగ్వివాదానికి దిగారు.

కిషన్ రెడ్డితో నవ్వుతూ..
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నవ్వుతూ ఇలా కనిపించారు.

అభివాదం చేస్తూ...
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌తో పాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శాసనసభ్యులకు అభివాదం చేస్తూ ఇలా కనిపించారు.

శ్రద్ధగా చూస్తూ
బడ్జెట్ ప్రతిపాదనలను శ్రద్ధగా పరిశీలిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన సీట్లో ఇలా కూర్చున్నారు.

ఈటెలతో కెసిఆర్
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నుంచి బడ్జెట్ ప్రతిపాదనలను అందుకుంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇలా కనిపించారు.

ఈటెల బడ్జెట్ ప్రతిపాదన
తెలంగాణ తొలి బడ్జెట్‌ను ప్రతిపాదించిన ఖ్యాతిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ దక్కించుకున్నారు. విపక్షాల గొడవ మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు

బిఎసి సమావేశంలో కెసిఆర్
స్పీకర్ మధుసూదనాచారి నిర్వహించిన బిఎసి సమావేశంలో మంత్రులతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications