వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వర్సెస్ కేసీఆర్: అది సరే కానీ, ఇది ఏ రకమైన పోటీ?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతి విషయంలోను పోటీ పడుతున్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇరువురు సీఎంలు ప్రతి విషయంలోను నేనంటే నేను అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఒకరి పైన మరొకరు పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని, అభివృద్ధి నుండి మొదలుకొని ఉద్యోగుల జీతాల వరకు వారు పోటా పోటీ ప్రకటనలు, వేతనాల పెంపు చేస్తున్నారు. తాజాగా, ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్‌తో మరోసారి వీరి మధ్య పోటీ అంశం చర్చకు వచ్చింది.

కేసీఆర్ - చంద్రబాబు

కేసీఆర్ - చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దాదాపు ప్రతి విషయంలోను పోటీ పడుతున్నారు.

రాజధాని

రాజధాని

హైదరాబాదు ఇప్పటికే ప్రపంచప్రఖ్యాతి గాంచింది. దీనిని మరింత ముందుకు తీసుకు వెళ్తామని, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రాజధానిని అత్యుత్తమమంగా తీర్చిదిద్దాలని కొత్త సచివాలయం, కళాభారతి నిర్మాణం, హుస్సేన్ సాగర్ నీటి శుద్ధి, స్వచ్ఛ హైదరాబాద్ కోసం కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

బహుళ అంతస్థులు

బహుళ అంతస్థులు

సాగర్ చుట్టూ వంద అంతస్తుల భవనాలు కడతామని గతంలో ప్రకటించారు. ఒకవిధంగా నూతనంగా ఏర్పడుతున్న ఏపీ రాజధానికి ధీటుగా ఉండాలని తెరాస భావిస్తోందని చెప్పవచ్చు.

రాజధాని

రాజధాని

హైదరాబాదుకు చంద్రబాబు హయాంలోనే ప్రపంచప్రఖ్యాతి వచ్చిందని, ఇప్పుడు ఏపీకి కూడా చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఏపీ రాజధానిని హైదరాబాదుకు ధీటుగా నిర్మిస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ వంటి విదేశీ సహకారం తీసుకుంటోంది.

టీఎన్జీవోలు

టీఎన్జీవోలు

కొద్ది నెలల క్రితం టీఎన్జీవోలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది.

ఏపీఎన్జీవో

ఏపీఎన్జీవో

కొద్ది నెలల క్రితం టీఎన్జీవోలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వవలసి వచ్చింది.

నారా లోకేష్ - కేటీఆర్

నారా లోకేష్ - కేటీఆర్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, తెలంగాణ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్‌లు ప్రస్తుతం అమెరికాలో పోటాపోటీగా పర్యటిస్తూ భారీ మొత్తంలో విదేశీ, ఎన్నారైల పెట్టుబడులను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

రాష్ట్రం

రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలోను తెలంగాణ పోటీ పడుతుందని చెప్పవచ్చు. స్మార్ట్ సిటీలు, రైల్వేలో తమ తమ రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో ప్రాజెక్టులు తీసుకు వచ్చేందుకు... ఇలా ప్రతి దాంట్లో పోటాపోటీ కనిపిస్తోందని చెప్పవచ్చు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రయివేటు వాహనాలు అధిక డబ్బులు వసూలు చేశాయి. వారం రోజుల పాటు కార్మికులు సమ్మె చేశారు. ఫిట్మెంట్ పైన ఇరు ప్రభుత్వాలు తర్జన భర్జన పడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ఇస్తే.. తమకు కష్టమని ఏపీ ప్రభుత్వం భావించింది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం మీద పైచేయి సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేచి చూసినట్లుగా కనిపించింది.

తర్జన భర్జన అనంతరం... తెలంగాణ ప్రభుత్వంను పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్‌కు ఓకే చెప్పింది. అంతలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ మెట్టు పైన ఉండేందుకు 44 శాతం ప్రకటించింది. ప్రభుత్వాలు ప్రతి విషయంలోను పోటీ పడుతున్నాయని చెప్పవచ్చు. అయితే, ఇది సామరస్యక పోటీ అయితే ఫరవాలేదు, పైచేయి కోసం అయితే మాత్రం భవిష్యత్తులో సమస్యలు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
KCR versus Chandrababu Naidu: Is it healthy Competition?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X