వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయోత్సవ ర్యాలీ: కెసిఆర్‌పై పూలవర్షం, ఒంటెపై హరీష్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గులాబీ దళాధిపతి కె. చంద్రశేఖర రావు వియోజత్సవ ర్యాలీ బుధవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభమైంది. కెసిఆర్‌కు స్వాగతం చెప్పడానికి వచ్చిన అభిమానులు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తలతో హైదరాబాద్ గులాబీమయంగా మారింది. లక్షలాది మంది కెసిఆర్‌కు స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయంలో కెసిఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ర్యాలీ ప్రారంభమైంది.

ప్రత్యేక రూపొందించిన వాహనంలో ఆయన బేగంపటే విమానాశ్రయం నుంచి తన ర్యాలీని ప్రారంభించారు. అంతకు ముందు ఆయన శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కెసిఆర్‌పై పూలవర్షం కురిపించారు. ర్యాలీ ఐదున్నర గంటల ప్రాంతంలో బేగంపేటకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు ఒంటపై ఎక్కి ర్యాలీలో పాల్గొన్నారు.

KCR victory rally begins in Hyderabad

బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గన్ పార్కులో అమర వీరుల స్థూపం వద్దకు రాత్రి తొమ్మిది గంటల తర్వాత చేరుకుంది. కెసిఆర్ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. కెసిఆర్‌ను అహ్వానించడానికి జరిగిన ర్యాలీ మాత్రమేనని, మార్చిలో కనీవినీ ఎరుగని రీతిలో సభ ఉంటుందని కెటిఆర్ చెప్పారు. ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ పోతున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి వస్తా అంటు చెప్పిన కెసిఆర్ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు.

గన్‌పార్క్ చేరుకున్న తర్వాత ఆయన అక్కడ అమరవీరుల శ్ధూపాలకు ఘన నివాళులు అర్పిస్తారు. తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంటికి బయల్దేరుతారు.

English summary
Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao's victory rally started from Begumpet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X