తెలంగాణ ప్రజలకు ఏది మంచిదనుకుంటే అది కెసిఆర్ చేస్తారు: సుజనా
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రజలకు ఏది మంచిదని అనుకుంటే అదే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేస్తారని కేంద్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో కలిసి శుక్రవారంనాడు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
హైకోర్టు విభజన కన్నా ముందు ఎపి భవన్ సహా మిగతా సంస్థల విభజన జరగాలని ఆయన అన్నారు. సంస్థల విభజన బాధ్యత కేంద్రానిదే అని ఆయన అన్నారు. అమరావతిలో హైకోర్టును నిర్మించే స్థలాన్ని కేంద్ర బృందం పరిశీలించిందని చెప్పారు. హైకోర్టుకు భూమి ఇవ్వాలని చట్టంలో ఉందని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయ న్నారు.

హైకోర్టు అంశంపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానిచారు. ఆరోగ్యం బాగా లేదని చంద్రబాబు కేంద్ర మంత్రి ఉమా భారతిని పరామర్శించారని ఆయన అన్నారు. నదీ జలాల పంపకం విభజన చట్టం ప్రకారమే జరుగుతోందని చెప్పారు.
చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిశారని ఆయన చెప్పారు. తన చైనా పర్యటనలో ఎపికి వచ్చిన పెట్టుబడుల గురించి చంద్రబాబు అరుణ్ జైట్లీకి వివరించినట్లు తెలిపారు. విభజన చట్టం అమలులో జాప్యాన్ని చంద్రబాబు జైట్లీ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు .పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని చంద్రబాబు రాజ్‌నాథ్ సింగ్‌ను కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా చర్చల దశలోనే ఉన్నట్లు చెప్పారు. కేంద్రంలో తెలుగుదేశం పార్టీకి మరో మంత్రిపదవి వస్తే సంతోషమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications