జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు: కెఈ
తిరుపతి: ఏపీ రాష్ట్రానికి వైఎస్ జగన్ ఏనాడు సీఎం కాలేడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు.జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతాడో అర్ధం కావడం లేదని కెఈ కృష్ణమూర్తి ఎద్దేవా చేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం కెఈ కృష్ణమూర్తి శుక్రవారం నాడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు.రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధించుకొన్నట్టు కెఈ చెప్పారు.ఏపీ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం అహర్నిశలు ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు.

మరో వైపు వైఎస్ జగన్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్ధం కావడం లేదని చెప్పారు. ఒకసారి బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతారు, మరోసారి బిజెపితో పొత్తు పెట్టుకొంటామని మాట్లాడుతారని చెప్పారు. అసలు ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.జగన్ రాష్ట్రానికి సీఎం కాలేడన్నారు..
ప్రధానమంత్రి గతంలో ముందస్తుగా ఎన్నికలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నారని వార్తలొచ్చాయని చెప్పారు. జమిలీ ఎన్నికలకే వెళ్ళే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్దంగా ఉన్నామని కెఈ చెప్పారు.












Click it and Unblock the Notifications