వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీటికి మాటికి దీక్షలేమిటి, మోడీని కలవండి: జగన్‌కు కెఈ సూచన

By Pratap
|
Google Oneindia TeluguNews

కర్నూలు/ న్యూఢిల్లీ/ నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ దీక్షలు మానుకోవాలని ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సూచించారు. దీక్షలు మాని ప్రధాని నరేంద్రమోడిని కలిసి హోదా గురించి మాట్లాడాలని ఆయన చెప్పారు.

వైయస్ జగన్ చీటికి మాటికి దీక్షలు చేయటం సబబు కాదని కేఈ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటామని కేఈ తెలిపారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన అన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

ఇదిలావుంటే, ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం, భోగాపురం ఎయిర్‌పోర్టు, తదితర పెండింగ్ ప్రాజెక్టులపై చంద్రబాబుతో చర్చించినట్టు తెలిపారు.

KE suggests YS Jagan to cancel fast in Guntur

త్వరలోనే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్, డొమిస్టిక్ రంగాల్లో కొత్త సర్వీసుల ప్రతిపాదనలపై చర్చించామని అశోక్‌ గజపతిరాజు చెప్పారు.

వీరమణితో పల్లె భేటీ

తమిళనాడు మంత్రి వీరమణి ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కలిశారు. తమిళనాడులో తెలుగు బోధనపై ఆయన వీరమణితో చర్చించారు. 30న తమిళనాడు, ఏపీ విద్యాశాఖ అధికారుల సమావేశం జరపాలని ఈ భేటీలో నిర్ణయించారు. తమిళనాడులో తెలుగు విద్యా బోధనను నిషేధించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పల్లె తమిళనాడు మంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
Andhra Pradesh deputy CM KE Krishna murthy suggested YSR Congress party president YS Jagan to withdraw proposed fast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X