అక్కడ గెలిచే పార్టీదే అధికారం ఖాయం - ఈసారి వారిదే..!!

ఏపీలో ఎన్నికల ఫలితాలు ఆసక్తిని పెంచుతున్నాయి. హోరా హోరీ సమరంలో గెలుపు పైన అదే రకమైన అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. జూన్ 4న వెల్లడి కానున్న ఫలితాల పైన భారీగా బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తానని ధీమాగా ఉన్నారు. టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో అసెంబ్లీ, రాష్ట్రంలో అధికారం సెంటిమెంట్ పైన కొత్త చర్చ మొదలైంది.

గెలుపు దక్కేదెవరికి
ఈ సారి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గాల్లో భీమిలి తొలి స్థానంలో ఉంది. తొలి నుంచి టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ అన్ని ఎన్నికల్లోనూ నిరూపణ అయింది. భీమిలి రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం. మూడు లక్షల 60 వేల మంది ఓటర్లు. సముద్ర తీరం, ఆద్యంతం ఆహ్లాదకర నియోజవర్గం, రూరల్, అర్బన్ మిక్స్‎డ్ ఓటింగ్, అత్యంత పొటెన్షియల్ నియోజకవర్గం, ఐటి హిల్స్, ఎండాడ, మధురవాడ లాంటి ఖరీదైన ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఇక, ఇక్కడ పోటీలో ఉన్న టీడీపీ - వైసీపీ అభ్యర్దులు మాజీ మిత్రులు.

Keen contest on the cards in Bhimili Assembly Segment will sentiment repeat here

హోరా హోరీ సమరం
ఈ సారి టీడీపీ నుంచి గంటా శ్రీనివాస రావు..వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. ఇద్దరూ ఇప్పటివరకు ఓటమి ఎరుగకపోవడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా ఉన్నా.. ఇప్పుడు వైసిపి కూడా అక్కడ సంస్థాగతంగా బలపడింది. అందులోనూ ఆనందపురం, పద్మనాభం, భీమిలిలో ఎక్కువ రూరల్ గ్రామాలు ఉండడంతో సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీకి మళ్ళీ మద్దతు ఇస్తారని నమ్ముతోంది వైసిపి. అదే సమయంలో ఇప్పటివరకు పోటీ చేసిన చోట మళ్ళీ చేయకుండా వరుసగా ఐదు ఎన్నికల్లో నెగ్గిన గంటా టీడీపీ నుంచి పోటీ చేయడంతో అటువైపు కూడా ఆసక్తి పెరిగింది. ఇద్దరు నేతలు గెలుపు పైన ధీమాగా ఉన్నారు.

సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా
2009లో ప్రజారాజ్యం నుంచి, 2019లో వైసీపీ నుంచి అవంతి గెలుపొందారు. 2014లో గంటా టీడీపీ నుంచి ఇక్కడ గెలవగా..రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019 లో మళ్ళీ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం, ఆ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ ఏర్పడిపోయింది. అక్కడ గెలిచిన పార్టీ దే రాజ్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.ప్రజారాజ్యం నుంచి టీడీపీలోనూ కలిసి పని చేసిన గంటా -అవంతి 2019 నుంచి వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఇద్దరూ భీమిలి నుంచి పోటీలో ఉండటం..గెలుపు ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో..ఇక్కడ గెలుపు పైన ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+