అరేబియా సముద్రంలో అల్పపీడనం: రాయలసీమ సహా: మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు

చెన్నై: అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలకు వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావం వల్ల కర్ణాటక, ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి. మరో 48 గంటల పాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశం ఉందని అంచనా వేశారు.

Recommended Video

    Weather Forecast : Cold Wave To Continue Over North India | Oneindia Telugu

    అరేబియా సముద్రంలో తాజాగా ఏర్పడిన అల్పపీడన ప్రభావం.. ఎలా ఉంటుందనేది అంచనా వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాయుగుండంగా మారడానికి అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడుతున్నారు. అరేబియా సముద్రం ఉపరితలం నుంచి రెండు కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి ఆవరించి ఉందని, అది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందుతుందా? లేదా? అనేది అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. తుఫాన్‌గా పరివర్తనం చెందడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు ప్రాథమికంగా వారు నిర్దారించారు.

    Kerala, Tamil Nadu, Puducherry likely to receive heavy rainfall in 24 hrs: IMD alert

    దీని ప్రభావంతో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. కర్ణాటక, దక్షిణ మహారాష్ట్ర, మహె, కరైకల్, ఏపీలోని రాయలసీమ జిల్లాల్లో వర్షపాతం నమోదవుతుందని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు దీని ప్రభావం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అన్నారు. తమిళనాడులోని రామనాథపురం, నాగపట్టిణం, రామేశ్వరం, కేరళలోని తిరువనంతపురం వంటి తీర ప్రాంత జిల్లాలకు చెందిన మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+