అంతా నేనే చేశా, రియల్ ఎస్టేట్ కోసమే: కేశవ రెడ్డి, 547 కోట్ల మోసం, స్కూల్ ఆస్తులు తాకట్టు
కర్నూలు: తాను ఎవరినీ మోసం చేయదల్చుకోలేదని, స్థిరాస్థి వ్యాపారం కోసం భూములు కొన్నానని కేశవ రెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవ రెడ్డి గురువారం నాడు చెప్పారు. ప్రస్తుతం వాటి విలువ చాలా తక్కువగా ఉందని చెప్పారు. ఏడాది సమయం ఇస్తే తాను ఆస్తులను అమ్మి అందరి డబ్బులు చెల్లిస్తానని చెప్పారు.
ప్రభుత్వం తన భూములను స్వాధీనం చేసుకొని డబ్బులు చెల్లించినా అభ్యంతరం లేదన్నారు. తనకు మోసం చేయాలనే మనస్తత్వమే ఉంటే సంవత్సరం నుంచి సమస్యను పరిష్కరించాలని ఎందుకు చూస్తానన్నారు. ప్రభుత్వం తన ఆస్తులు తీసుకుంటానంటే ఇచ్చేందుకు నేను సిద్ధమని చెప్పారు.
మంచి ఉద్దేశ్యంతోనే డిపాజిట్లు సేకరించానని, మోసం చేసే ఉద్దేశ్యం తనకు లేదన్నారు. మోసం చేయాలనుకుంటే ఐపీ పెట్టేవాడినని చెప్పారు. ఏడాది ఆగితే అందరికీ అన్నీ చెల్లిస్తానని చెప్పారు. ఈ తప్పంతా నేనే చేశానని చెప్పారు. ఇందులో ఎవరికి పాత్ర లేదన్నారు.

రూ.547కోట్ల మేర మోసం
కేశవ రెడ్డిని తాము బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నామని కర్నూలు ఎస్పీ రవికృష్ణ చెప్పారు. ఆయన పైన అయిదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 11వేల మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించినట్లు ఎస్పీ తెలిపారు.
800 మంది ప్రయివేటు వ్యక్తుల నుంచి కూడా డబ్బులు సేకరించారన్నారు. రూ.547 కోట్ల డిపాజిట్లు సేకరించి మోసం చేశాడని తెలిపారు. పాఠశాలల ఆస్తులను తాకట్టి పెట్టి కూడా వివిధ బ్యాంకుల్లో రూ.62 కోట్ల రుణం తీసుకున్నట్లు ఎస్పీ రవికృష్ణ చెప్పారు.
కేశవ రెడ్డి పైన పాణ్యం, నంద్యాల పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయి ఉన్నట్లు చెప్పారు. అతని పైన ఏపీసీ సెక్షన్లు 420, 403, 109, 149 కింద కేసులు పెట్టినట్లు చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.470 కోట్లు తీసుకున్నారన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు డిపాజిట్ కడితే పదో తరగతి వరకు ఉచితంగా చదివిస్తామని చెప్పి ఆ డబ్బు వసూలు చేసినట్లు చెప్పారు. పదో తరగతి అయ్యాక ఆ డిపిజిట్లను తిరిగి చెల్లిస్తామని చెప్పాడని ఎస్పీ తెలిపారు. ఒక్కొక్కరి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేశవ రెడ్డి పేరుతో విద్యాసంస్థలు నడుపుతున్న ఆయన పైన అనేక ఫిర్యాదులు అందాయి. తమ సంస్థల స్కూళ్లు, కాలేజీల్లో జాయినింగ్ సమయంలో విద్యార్థుల నుంచి లక్ష నుంచి రూ.రెండున్నర లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు.
ఆ డిపాజిట్ల సొమ్ము రూ.700 నుంచి రూ.800 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ మొత్తంలో భాకీ పడ్డారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మూడు సెంటర్లలోని మదనపల్లిలో రూ.12 కోట్లు, చిత్తూరులో రూ.4 కోట్లు, తిరుపతి బ్రాంచిలోను పెద్ద మొత్తం ఉన్నట్లుగా తెలుస్తోంది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications