ఎప్పటిలోగా ఆ పని చేస్తారు: లోకసభలో అరుణ్ జైట్లీకి కేశినేని నాని సూటి ప్రశ్న

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని, ఆ తర్వాత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిందని, దానికి ఎప్పుడు చట్టబద్ధత కల్పిస్తారో చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని టిడిపి ఎంపి కేశినేని నాని లోకసభలో బుధవారం ప్రశ్నించారు.

Keshineni Nani raises Special Package issue in Lok Sabha

ప్రత్యేక ప్యాకేజీకి వెంటనే చట్టబద్ధత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పటిలోగా ఆ పని చేస్తారో చెప్పాలని జైట్లీని సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిందని గుర్తు చేశారు. అయితే ఆ అంశాన్ని మీరు పక్కన పెట్టారన్నారు.

ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారని, రెండు నెలలు గడుస్తున్నా దాని పైన ఎలాంటి ప్రకటన లేదని చెప్పారు. ప్రత్యేక హోదా కుదరకపోతే ప్యాకేజీకి వెంటనే చట్టబద్ధత కల్పించాలని కేశినేని నాని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party MP Keshineni Nani raises Special Package issue in Lok Sabha.
Please Wait while comments are loading...