Vijayawada Utsav: విజయవాడ ఉత్సవ్ కోసం భారీగా వసూళ్లు ? ఎంపీ కేశినేని క్లారిటీ...!

ఏపీలో దసరా సందర్భంగా రేపు విజయవాడ నగరంలో సందడి ప్రారంభం కాబోతోంది. ఓవైపు దసరా మహోత్సవాలతో పాటు మరోవైపు విజయవాడ ఉత్సవ్ కూడా ప్రారంభమవుతోంది. ఈసారి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని స్వయంగా చొరవ తీసుకుని దీన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేవాదాయశాఖ భూముల్ని తీసుకోవడం వివాదం రేపినా హైకోర్టు ఊరట ఇచ్చింది. అనంతరం ఈ ఉత్సవ్ కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎంపీ క్లారిటీ ఇచ్చారు.

సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో "ఒకే నగరం.. ఒకే ఉత్సవం" నినాదంతో తలపెట్టిన "విజయవాడ ఉత్సవ్" పేరు చెప్పి కమిటీ సభ్యులు ఎవరూ కూడా డబ్బులు వసూలు చేయలేదని ఎంపీ కేశినేని తెలిపారు. కొందరు ఆరోపిస్తున్నట్లు దేవాదాయ శాఖ భూములను ఆక్రమించే ఆలోచనతో కాదు, అభివృద్ధి చేయాలని మాత్రమే ఎగ్జిబిషన్ ఏర్పాటుకు సంకల్పించామన్నారు.

Kesineni Chinni Clarifies on Fund Collection Allegations Linked to Vijayawada Utsav

ప్రతిపక్షాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎంపీ కేశినేని తేల్చేశారు. ప్రతిపక్షాలు తమ ఉనికిని కాపాడుకునేందుకు చేస్తున్న అసత్య ప్రచారాలకు గట్టిగా సమాధానం చెప్పాలని కూటమి శ్రేణులకు ఎంపీ శివనాథ్ పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న గొల్లపూడి సమీపంలోని దేవాదాయ శాఖ భూములను 56 రోజులకు లీజుకు తీసుకొని, నిబంధనల ప్రకారం రూ. 45 లక్షలు ప్రభుత్వానికి చెల్లించామని, లీజు ముగిసిన వెంటనే ఆ భూములను తిరిగి దేవదాయ శాఖకు అప్పగిస్తామని తెలిపారు.

ఉత్సవ్ కమిటీ అభివృద్ధి చేసిన భూములను తిరిగి వేరే ఈవెంట్లకు లీజుకి ఇవ్వటం ద్వారా దేవాదాయ శాఖకు ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. పున్నమి ఘాట్ లో ప్రతిరోజు డ్రోన్ షో ఉందని, ఉత్సవాల మొదటి రోజు చివరి రోజు క్రాకర్స్ షో నిర్వహించాలని భావించగా, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్న నేపథ్యంలో ఈనెల 24న క్రాకర్స్ షో నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ ఉత్సవాలకు పడవ పందాలు, రాత్రి జరిగే స్నేక్ బోట్ రైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఎంపీ స్పష్టం చేశారు.

Kesineni Chinni Clarifies on Fund Collection Allegations Linked to Vijayawada Utsav

11 రోజుల పాటు నిర్విరామంగా 256 కార్యక్రమాలు జరుగుతాయని, గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజల భాగస్వామ్యంతో ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు. సుమారు 15 లక్ష మంది వచ్చే విధంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధం చేశారని, జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు 11 రోజులు 11 సినిమా ఈవెంట్లు జరుగుతాయని ఎంపీ పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఫుడ్ స్టాళ్లలో కేవలం శాఖాహారం విక్రయాలకు మాత్రమే అనుమతిస్తారని ఎంపీ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+