మోడీని కలిసిన ఎంపి నాని: ప్రధాని అభినందన(ఫొటో)
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటు భవన్ కార్యాలయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) కలిశారు. టాటా ట్రస్ట్ మైక్రోప్లానింగ్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రధానికి వివరించారు.
విజయవాడలోని 264 గ్రామాలను టాటా ట్రస్ట్ దత్తత తీసుకున్న విషయాన్ని తెలపగా, ఇందుకు నానిని ప్రధాని మోడీ అభినందించారు. మిగిలిన ఎంపీలు కూడా నానిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

టాటా ట్రస్ట్ ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తానని మోడీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. 25 నిమిషాలపాటు ప్రధానితో ఎంపి కేశినేని నాని సమావేశమయ్యారు.
సింగిల్ డెస్క్ పోర్టల్‌ను ప్రారంభించిన సిఎం
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితంగా అనుమతిచ్చేలా రూపొందించిన సింగిల్ డెస్క్ పోర్ట ల్‌ను ఏపి సిఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. విశాఖలో ప్రారంభమైన పారిశ్రామిక మిషన్ వేదిక చంద్రబాబు ఈ పోర్టల్‌ను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications