వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు నాయకత్వంపై కేశినేని సంచలనం: జగన్ సీఎం కావాలనుకోవడం లేదు, బాబుకు ఆ పేరు వద్దనే!

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తన వల్ల ఇబ్బంద

|
Google Oneindia TeluguNews

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తన వల్ల ఇబ్బంది ఉండకూడదనే తాను తెలుగు రాష్ట్రాల్లో కేశినేని ట్రావెల్స్‌ను మూసివేనట్లు చెప్పారు. కేశినేని ట్రావెల్స్‌కు 90ఏళ్ల చరిత్ర ఉందని, మిగితా ట్రావెల్స్‌లా కాదని అన్నారు.

పీఆర్ఫీ సక్సెస్ కాదని..

పీఆర్ఫీ సక్సెస్ కాదని..

ప్రజారాజ్యం పార్టీ సక్సెస్ కాదని తనకు ఆనాడే తెలుసునని ఎంపీ కేశినేని నాని అన్నారు. పరిణతి లేని నాయకత్వమనే బయటికొచ్చినట్లు పరోక్షంగా అనాటి పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవిపై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు విధానాలు నచ్చే టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.

బాబుకు ఆ పేరు వద్దనే..

బాబుకు ఆ పేరు వద్దనే..

ఆర్టీఏ కార్యాలయంవ్యవహారంలో తాను రవాణా శాఖ అధికారిని ఏమీ అనలేదని కేశినేని నాని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. సారీ చెప్పమన్నారనే.. తాను క్షమాపణలు చెప్పాననని తెలిపారు. తన వల్ల చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు రాకూడదనే ఉద్దేశంతోనే తన ట్రావెల్స్‌ను నిలిపివేసినట్లు చెప్పారు.

మంచిది కాదు..

మంచిది కాదు..

విజయవాడను ఉత్తమ పార్లమెంటు నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేశినేని నాని చెప్పారు. కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవులు ఆశించడం, ఆగ్రహించడం మంచిది కాదని ఆయన అన్నారు.

బాబు విధానాలు నచ్చే..

బాబు విధానాలు నచ్చే..

పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష పార్టీలది అనవసర రాద్ధాంతమని అన్నారు. చంద్రబాబు విధానాలు నచ్చే తాను టీడీపీలోకి వచ్చినట్లు తెలిపారు. ఎప్పటికీ టీడీపీలోనే ఉంటానని తేల్చి చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

జగన్ కావాలనుకోవడం లేదు..

జగన్ కావాలనుకోవడం లేదు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి సీఎం కావాలని ప్రజలు కోరుకోవడం లేదని తెలిపారు. 2019లోనూ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని కేశినేని నాని జోస్యం చెప్పారు. మంత్రి పదవులు లభించని సీనియర్ ఎమ్మెల్యేల అసంతృప్తి తాత్కాలికమేనని చెప్పారు. మంత్రి పదవి రాలేదని బోండా మహేశ్వరరావు ఆవేదన చెందారని చెప్పారు.

English summary
Telugudesam MP Kesineni Nani responded on his travels ban and other issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X