కేశినేని నాని పొలిటికల్ రీ ఎంట్రీ, ఢిల్లీ మంత్రాంగం - బిగ్ టర్న్..!!

విజయవాడ రాజకీయాల్లో కీలక మలుపు. మాజీ ఎంపీ కేశినేని కేంద్రంగా కీలక మంత్రాంగం సాగు తోంది. మద్దతు దారులు.. అనుచరులతో నాని వరుస భేటీలకు సిద్దమయ్యారు. నాని సోదరుడు చిన్ని ప్రస్తుతం టీడీపీ ఎంపీగా ఉన్నారు. మారుతున్న సమీకరణాలతో కేశినేని నాని మరోసారి రాజకీయంగా యాక్టివ్ అయ్యేందుకు సిద్దమయ్యారు. ఢిల్లీ కేంద్రంగా ముఖ్య నేతలతో చేస్తున్న చర్చలు కొత్త టర్న్ తీసుకున్నాయి. ఈ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

మాజీ ఎంపీ కేశినేని పొలిటికల్ రీ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన నాని.. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసారు. తన సోదరుడు టీడీపీ అభ్యర్ధి చిన్ని చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలానికే రాజకీయాల నుంచి విరమిస్తున్న ట్లుగా ప్రకటించారు. అయితే, ఇప్పుడు విజయవాడ కేంద్రంగా సమీకరణాలు మారుతున్నాయి. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తిరిగి నాని తన ఆలోచన మార్చుకున్నట్లు తెలు స్తోంది. తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.

kesineni-srinivas-chances-to-re-entry-in-vijaywada-politics-as-discussions-with-supporters

తన సోదరుడు కేశినేని శివనాధ్ పై ఇటీవల కాలంలో సొంత పార్టీ నేతల నుంచి వస్తున్న విమర్శలతో ఆయన మరొకసారి రాజకీయంగా తానేంటో సత్తా చాటేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందులో భాగంగా నాని ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా కొందరు ముఖ్య నేతలతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

కాగా..బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉండటంతో... టీడీపీ నాయకత్వం నుంచి నాని బీజేపీలో చేరాలని ప్రయత్నించినా మద్దతు లభించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే, బీజేపీ నాయకత్వం నాని తమ పార్టీలో ఎంట్రీని ఆహ్వానించాలని డిసైడ్ అయితే.. టీడీపీ గట్టిగా అడ్డుకునే అవకాశాలు ఉండవని మరో వాదన. దీంతో, నాని ముందుగా విజయవాడ పార్లమెంట్ లో తనకు ఉన్న మద్దతును బలోపేతం చేసుకునే విధంగా వ్యూహాలు సిద్దం చేసినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించి తన అనుచరులు, మద్దతు దారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. దీని ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పార్టీని ఖరారు చేసుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం ఖాయమని చెబుతున్నారు. దీంతో... ఇప్పుడు నాని రాజకీయ అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+